ప్రజా తీర్పులో గెలిచేదెవరు...?

రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. మంగళవారం ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏపీలోలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Which political party will win in AP

ఇక రాష్ట్రవ్యాప్తంగా 33 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. మొత్తం 401 హాళ్లను ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు రాగా, టీడీపీ 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ గట్టి ప్రయత్నం చేసింది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని సీఎం జగన్ భారీ వ్యూహాలను అమలు చేశారు. మరి అధికారంలో ఎవరికి దక్కుతుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+