'సవాల్.. సత్తా చాటుతావా! చంద్రబాబుకు ఉన్న దమ్ము, జగన్‌కు లేదు'

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు ప్రకటించే దమ్ము ఉందా అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ గురువారం నాడు సవాల్ చేశారు. జగన్ ఎప్పుడైనా ఆస్తులు ప్రకటించారా అని నిలదీశారు.

చంద్రబాబు ఆస్తులు రూ.3.73 కోట్లు: భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిల పేరిట ఆస్తులు ఇవే...

తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పారు. ప్రతి ఏడాది స్వచ్ఛందంగా ఆస్తులను ప్రకటిస్తూ చంద్రబాబు కుటుంబం తమ చిత్తశుద్ధిని చాటుకుంటోందన్నారు. జగన్‌కు ఆ దమ్ము లేదన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో లోటస్‌పాండ్‌, బెంగళూరు వైట్‌హౌస్‌ వివరాలు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి ఇష్టం లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం వేరుగా చెప్పారు. మెగా అక్వా ఫుడ్ పార్కుతో ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు. జగన్ రాద్దాంతం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

Why YS Jagan not announcing his assets?

కాగా, అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.570 కోట్ల పంట నష్టపరిహారం త్వరలో ఇస్తామని తెలిపారు.

మంత్రి నారాయణ హెచ్చరిక

ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో త్వరలో కాలువల విస్తరణ పనులు మొదలు కానున్నాయని, ఆక్రమణలు తొలగించకపోతే ముంపు తప్పదని మంత్రి నారాయణ అన్నారు. గురువారం నగరంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. కాలువలపై నివసిస్తున్న 5200 మందికి ప్రత్యామ్నాయం చూపాకే ఆక్రమణల తొలగింపు ఉంటుందన్నారు. యాష్ పాండ్ దగ్గర అత్యున్నత ప్రమాణాలతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. త్వరలో ఆన్‌లైన్ ద్వారానే అవుట్ అనుమతులు ఉంటాయని, భనవాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతు ఇస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+