బడ్జెట్‌పై జగన్ డబుల్ గేమ్: కాల్వ, దారినపోయే దానయ్య: మంత్రి నారాయణ

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర బడ్జెట్ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదని టీడీపీ నేత, మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆదివారం మండిపడ్డారు.

బడ్జెట్ విషయంలో జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష వైసీపీ ఏపీకి అన్యాయం జరుగుతున్నప్పటికీ తన బాధ్యతను విస్మరించిందన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

Why YS Jagan not responding on Budget, questions Kalva

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని అందరు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు చెబుతున్నప్పటికీ జగన్ ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రశ్నించలేని నిస్సహాయస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

జగన్ పైన మంత్రి నారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. జగన్‌కు ప్రజలు ప్తిపక్ష హోదా ఇచ్చింది అబద్దాలు చెప్పేందుకు కాదన్నారు. పేదల అభ్యున్నతికి చేపట్టిన పథకాలపై ప్రతిపక్షం అసత్యాలు మానుకోవాలన్నారు. దారిన పోయే దానయ్య ఇచ్చే సమాచారంతో జగన్ మాట్లాడటం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+