ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

గ్రామానికి చెందిన బత్తుల దుర్గ గత కొద్దికాలంగా ఓ వ్యక్తితో రహస్యంగా అక్రమసంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త నిలదీయడంతో అత్యంత దారుణానికి ఒడిగట్టింది. బుధవారం రాత్రి నిద్రిస్తున్న ఆమె భర్తను ప్రియుడితో కలిసి హతమార్చి దుర్గ ప్రియుడితో కలసి పరారైంది. దీంతో గురువారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్య వైవాహికేతర సంబంధాన్ని భర్త నిలదీయటంతో భార్య బత్తుల దుర్గ ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు స్థానికులు పోలీసులుకు వెల్లడించారు.
గతంలో ఆమె భర్తపై హత్యాయత్నం చేసి జైలు కూడా వెళ్లి వచ్చిందని వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications