ప్రధాని కోరారు : సీఎం జగన్ - చంద్రబాబు ఓకే : పవన్ మాత్రం ఇప్పటికీ..!
ఇప్పుడు దేశం మొత్తం ఒక కొత్త ఉత్సహంతో ప్రత్యేక సందర్భం జరుపుకుంటోంది. ఈ సమయంలో ప్రధాని మోదీ యావత్ దేశానికి ఒక పిలుపునిచ్చారు. ఐక్యత చాటేందుకు ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. దీనికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. కేంద్రంలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సైతం ఆ పిలుపును అమలు చేస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ..ప్రతిపక్ష టీడీపీ అధినేతలు సైతం ఫాలో అవుతున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలు కార్యక్రమాలను ప్రకటించాయి. ప్రతీ ఇంటా జెండా ఎగుర వేయాలని అటు కేంద్రం ...ఇటు రెండు రాష్ట్రాలు తీర్మానించాయి. దీనికి అనుగుణంగా ప్రతీ ఇంటికి జెండా పంపిణీ చేయనున్నారు. దీని పైన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా స్థానిక సంస్థల ప్రతినిధు లతో సమావేశం ఏర్పాటు చేసారు. ఏపీ ప్రభుత్వం గ్రామ - వార్డు సచివాలయల ద్వారా ప్రతీ ఇంటికి జెండా పంపిణీ చేయనుంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ గత ఆదివారం మన్ కీ బాత్ లో భాగంగా.. అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించిన డీపీల్లో.. త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ప్రధాని పిలుపు మేరకు.. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్చర్స్ ను మార్చి.. మువ్వన్నెల జెండాను పెట్టారు. అదే విధంగా సీఎం జగన్ తన వ్యక్తిగత ఖాతాలకు..అదే విధంగా వైసీపీ సోషల్ మీడియా డీపీగా త్రివర్ణ పతాకంతో మార్చారు. ఇదే సమయంలో ఈ రెండు పార్టీల తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతాలో మాత్రం ఇంకా డీపీ మార్చలేదనేది స్పష్టం అవుతోంది. పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్చర్ గా జాతీయ జెండా పెట్టినట్లయితే .. ఆయన్ను ఫాలో అయ్యే జనసైనికులు..,అభిమానులు సైతం అదే విధంగా ఫాలో అవటం ఖాయం. దీంతో..ఇప్పుడు జాతీయ స్థాయిలోని రాజకీయ -అధికార ప్రముఖులు అనేక మంది తమ డీపీలుగా జాతీయ జెండాలతో మార్చేసారు.












Click it and Unblock the Notifications