వివస్త్రను చేసి మహిళను దారుణంగా హత్య.. భర్త, అత్తమామ, ఆడబిడ్డ కిరాతకం
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు కట్టుకున్న వాడే కాలయముడు అయ్యాడు. కనీసం కనికరం చూపించి కాపాడాల్సిన అత్తింటి వారు సైతం ఆ కిరాతకుడికి చేతులు కలిపారు. కట్నం కోసం కిరాతకంగా మారి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ కలిసి.. ఓ మహిళను తీవ్ర వేధింపులకు గురి చేయడమే కాకుండా.. వివస్త్రను చేసి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కట్నం కోసం మహిళను భర్త హరికృష్ణ, అత్తమామలు నాగోరు, నర్సమ్మ, ఆడపడుచు నాగలక్ష్మి గత కొంతకాలంగా వేధిస్తూ పలుమార్లు ఆమెపై దాడి చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు కూడా మరోసారి ఆమెతో గొడవ పెట్టుకున్నారు. బాధితురాలు తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించడంతో ఆమెపై మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని భయపడి ఆమెకు రంగునీళ్లు తాగించి ఊపిరాడకుండా చేశారు.

ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి దారుణంగా కొట్టి హతమార్చారు. అయితే హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరిచేందుకు కూడా యత్నించినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications