వివాహేతర సంబంధంపై నిలదీత: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది
చిత్తూరు: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కలదిన్నెకు చెందిన రమేష్‌నాయక్(32) కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య బాలమ్మ, కుమార్తె శిరిషా(11) ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మురళీనాయక్‌తో బాలమ్మ రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో ఆమెను తీసుకుని మురళీనాయక్ కురవంకలో కాపురం పెట్టాడు. బుధవారం మధ్యాహ్నం రమేష్‌నాయక్ కాయిన్‌బాక్సు ద్వారా మురళీనాయక్‌కు ఫోన్ చేసి తన భార్యను పంపాలని తిట్టాడు. ఆగ్రహించిన అతను, భార్య సుజాతతో కలిసి రాత్రి నక్కలదిన్నెకు చేరుకుని రమేష్‌నాయక్‌తో గొడవపెట్టుకున్నారు.

అందరూ చూస్తుండగానే మురళీనాయక్, భార్య సుజాత, సోదరుడు ముగ్గురు కలసి రమేష్‌నాయక్‌ను కత్తితో కడుపులో పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఒకటోపట్టణ నిలయాధికారులు దస్తగిరి, సుకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందని పోలీసులకు స్థానికులు తెలిపారు. మృతుడి సోదరి ఉమ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను గాలిచేందుకు ఓ పోలీసు బృందం వెళ్లింది. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications