తీరిక లేదా? నీ లక్షకోట్ల పైనా చెప్పాం: జగన్ లేఖపై యనమల కౌంటర్
విశాఖ/హైదరాబాద్: మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అన్నింటిని తాము నెరవేరుస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనను వెనక్కి తీసుకొస్తామన్నారు.
బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడంపై యనమల ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఉంచుతున్నామన్నారు. అయినా ఆ వివరాలను చూసుకొనే తీరిక కూడా లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలేదంటూ అనవసరంగా జగన్ విమర్శలు చేస్తున్నారని చెప్పారు.
6 నెలల్లో ఏపీ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను సమర్పిస్తాం: నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను ఆరు నెలల్లో సమర్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్ ప్రతినిదుల బృందం తెలియజేసింది. మంగళవారం రాజధాని మంత్రుల కమిటీతో సింగపూర్ బృందం దాదాపు మూడున్నర గంటల పాటు సమావేశమైంది.
రాజధాని భూములు, నీటి సదుపాయాలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాజధాని ప్రాంతానికి రోడ్డు, రైల్వే కనెక్టివిటీ మార్గాలను సింగపూర్ బృందానికి మంత్రి నారాయణ వివరించారు. క్యాపిటల్ డిజైన్ బృందం డైరెక్టర్‌గా క్యుతేజెను సింగపూర్ ప్రభుత్వం నామినేట్ చేసింది. సింగపూర్ బృందం నేటి నాలుగు రోజుల పాటు రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనుంది.












Click it and Unblock the Notifications