చూసి అడగండి!: బడ్జెట్.. పరిస్థితి యనమలకు సవాలే

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌పై కసరత్తు ముమ్మరమైంది. వచ్చే నెల్లో శాసనసభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కూర్పుపై వివిధ శాఖల అధికారులతో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్షలు ప్రారంభించారు. ఎవరికి ఎంత నిధులు కావాలన్న అంశంపై ఆరా తీశారు. ఇదే సమయంలో వాస్తవంగా ఎంత కావాలో.. అంతే అడగాలని సూచించారు. ఆ మేరకే ప్రతిపాదనలు ఉండాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయశాఖలు, వాటి అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం భేటీ అయ్యారు.

గత బడ్జెట్‌లో ఇచ్చిన నిధులు అందుకే ఆయా శాఖలు చేసిన ఖర్చు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని శాఖల్లో కేటాయింపుల కన్నా ఖర్చు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బడ్జెట్ వాస్తవాలకు ప్రతిరూపంగా ఉంటుందని యనమల ఈ సందర్భంగా అన్నారు. అధికారులు ఇప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితులను అర్ధం చేసుకుని, వాస్తవంగా ఎంత కావాలో ప్రతిపాదించాలని సూచించారు.

యనమల

యనమల

వచ్చే నెలలో శాసనసభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కూర్పుపై వివిధ శాఖల అధికారులతో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్షలు ప్రారంభించారు.

యనమల

యనమల

ఎవరికి ఎంత నిధులు కావాలన్న అంశంపై యనమల అధికారుల నుండి ఆరా తాశారు. ఇదే సమయంలో వాస్తవంగా ఎంత కావాలో.. అంతే అడగాలని సూచించారు.

యనమల

యనమల

గత బడ్జెట్‌లో ఇచ్చిన నిధులు అందుకే ఆయా శాఖలు చేసిన ఖర్చు వంటి వివరాలు అధికారుల నుండి యనమల అడిగి తెలుసుకున్నారు.

యనమల

యనమల

బడ్జెట్ వాస్తవాలకు ప్రతిరూపంగా ఉంటుందని అధికారులతో సమీక్ష సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

యనమల

యనమల

అధికారులు ఇప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితులను అర్ధం చేసుకుని, వాస్తవంగా ఎంత కావాలో ప్రతిపాదించాలని యనమల రామకృష్ణుడు సూచించారు.

సెప్టెంబర్‌ మొదటి వారంలోగా బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉన్నందున మంత్రి యనమల బడ్జెట్‌ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే బడ్జెట్‌ సమీక్షల్లో భాగంగా మంగళవారం పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలకు బడ్జెట్‌ ఎంత కేటాయించాలనే దానిపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.

అలాగే వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మార్కెటింగ్‌, గిడ్డంగులు, పశుసంవర్ధక, మత్స్య, పౌరసరఫరాలు, సహకార శాఖలపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలను సేకరించారు. ఇవేకాకుండా 17, 18 తేదీల్లోనూ ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రతి శాఖకు గంటసేపు సమయాన్ని కేటాయిస్తున్నారు.

కాగా, రాజధాని లేదు.. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌.. ఆదాయం ఎంత వస్తుంది.. ఖర్చులు ఎంత.. దేనికి ఎంత కేటాయించాలి.. ప్రధానమైన అవసరాలేంటి..? పొదుపు మంత్రం పాటించడం ఎలా..? ఇలాంటి సవాళ్లన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఎదుట ఉన్నాయి. ఇవన్నీ సరిదిద్దుకుంటూ రాష్ట్ర అవసరాలు, ఖర్చులతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్‌ను ఎలా కేటాయించాలనే దానిపై యనమల కసరత్తు చేస్తున్నారు. గతంలోనూ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని చక్కపెట్టడం అనేది యనమలకు సవాలే కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+