టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు పై వైసీపీ అభ్యర్దిగా మహిళా నేత..!!

ఏపీలో ఎన్నికల లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీతో పాటుగా లోక్ సభకు పార్టీలు అభ్యర్దులను ఖరారు చేస్తున్నాయి. సీఎం జగన్ గెలుపే ప్రామాణికంగా అవసరమైన నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్పు చేస్తున్నారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి గెలవని లోక్ సభ, అసెంబ్లీ స్థానాల పైన ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. శ్రీకాకుళం లోక్ సభ నుంచి కొత్త అభ్యర్దిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు.

శ్రీకాకుళం పై గురి : ముఖ్యమంత్రి జగన్ ఈ సారి సామాజిక - ప్రాంతీయ సమీకరణాలతో అభ్యర్దుల ఎంపిక ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఇంఛార్జ్ ల మార్పు ప్రక్రియ కసరత్తు కొనసాగుతోంది. 11 నియోజవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన సీఎం జగన్ రెండో జాబితా ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఎంపీ అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. ఈ సారి పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా.. కొందరు మంత్రులు, సీనియర్లను ఎంపీ అభ్యర్దులుగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం తరువాత గెలవని శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు స్థానాల్లో జగన్ ఈ సారి కొత్త సమీకరణాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం నుంచి ఎంపీగా మహిళా అభ్యర్దిని బరిలోకి దింపుతారని తెలుస్తోంది.

YCP Chances to Field Piryia Vijaya Sai Raj form Srikakulam loksabha against Ram Moha Naidu

కొత్త లెక్కలతో : శ్రీకాకుళం ఎంపీగా కింజరపు రామ్మోహన్ నాయుడు వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ, ఆయన్ను పార్లమెంట్ కే పోటీ చేయించాలనేది టీడీపీ నాయకత్వ నిర్ణయంగా తెలుస్తోంది. ఈ సమయంలో వైసీపీ నుంచి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేరు పరిగణలోకి తీసకున్నట్లు చెబుతున్నారు. స్పీకర్ తమ్మినేని, అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, ఇప్పుడు కొత్తగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్ పేరు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళకు సీటు ఇవ్వటంతో పాటుగా బీసీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించిట్లవుతుందని చెబుతున్నారు.

YCP Chances to Field Piryia Vijaya Sai Raj form Srikakulam loksabha against Ram Moha Naidu

మహిళకు అవకాశం : పిరియా విజయసాయిరాజ్ భర్త ఇచ్ఛాపురం సీటు ఆశిస్తున్నారు. విజయను ఎంపీగా బరిలోకి దింపి..ఇచ్ఛాపురం నుంచి కొత్త అభ్యర్దిని బరిలోకి దింపాలనేది వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది. పార్లమెంట్ పరిధిలోని సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. రాజ్ కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు కావటం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. విజయ సూర్య బలిజ వర్గానికి చెందిన మహిళా నేత. ప్రస్తుతం మూడు పేర్ల పైన వైసీపీ నేతలు సర్వేల ద్వారా క్షేత్ర స్థాయిలో ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. నివేదికల ఆధారంగా అభ్యర్ది ఎవరనేది ఖరారు చేసే అవకాశం అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+