Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోకా భాస్కరరావు హత్యకు కారణమిదేనా..? గుమ్మటాల చెరువుపై వివాదం, అంతుచూస్తానన్న మాజీమంత్రి..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్యతో మచిలీపట్నం ఉలిక్కిపడింది. భాస్కరరావు-మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర మధ్య విభేదాలు ఉన్నాయని, అందుకోసం తన అనుచరుడు చింతా చిన్నితో హత్య చేయించారని భాస్కరరావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో వీరి మధ్య వివాదానికి కారణం ఏంటీ అనే ప్రశ్న తలెత్తింది. ఆ గొడవతోనే హత్య జరిగిందా...? హత్య చేసింది ఎవరు...? అనే ప్రశ్నలకు పోలీసుల విచారణలో సమాధానం తెలియనుంది.

వివాదం ఇందుకే..?

వివాదం ఇందుకే..?

గుమ్మటాల చెరువు విషయంలో భాస్కరరావు, మాజీమంత్రి కొల్లు రవీంద్రకు వివాదం ఉంది. ఈ విషయాన్ని భాస్కరరావు అన్న కుమారుడు మోకా రాజేశ్ కన్నా తెలిపారు. మత్స్యకార కుటుంబానికి చెందిన భాస్కరరావు.. తన అనుచరుల సమస్యను తన ప్రాబ్లంగా భావించి పరిష్కరించేవారు. ఇలా ఆయన రాజకీయంగా ఎదిగే క్రమంలో కొందరు ఓర్వలేరు అని రాజేశ్ చెబుతున్నారు. ఇటు కులంలో సామాజికంగా, అటు బందరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా రెండుసార్లు పనిచేయడం.. రాజకీయంగా ఎదగడంతో ఓర్వలేకే హత్య చేశారని ఆరోపించారు.

 కొంతకాలంగా ఘర్షణ..

కొంతకాలంగా ఘర్షణ..


గుమ్మటాల చెరువు విషయంలో అంతకుముందు కూడా ఘర్షణ జరిగిందని రాజేశ్ తెలిపారు. గతంలో తాను మంత్రిగా చేశాను.. గుర్తుంచుకో అని కొల్లు రవీంద్ర అన్నాడని చెప్పారు. నీ అంతుచూస్తానంటూ బెదిరించాడని.. చెప్పినట్టు అన్నంత పనిచేశాడని వాపోయాడు. తన బాబాయ్ భాస్కరరావు హత్య చేయించింది మాజీమంత్రి కొల్లు రవీంద్ర అని, ఇందులో అనుమానానికి తావులేదన్నారు. తన అనుచరుడు చింతా చిన్నతో హత్య చేయించారని ఆరోపించారు.

బుల్లెట్‌పై నిందితుడు...?

బుల్లెట్‌పై నిందితుడు...?


మచిలీపట్నం మార్కెట్‌లో హత్య జరిగిన తర్వాత ప్రధా నిందితుడు పారిపోయి వచ్చాడు. అయితే అతనిని ఒకరు బుల్లెట్‌పై ఎక్కించుకొని వెళ్లారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుడేజీ పరిశీలించి.. ఏపీ 16వీఎల్ 6669 బుల్లెట్‌గా గుర్తించారు. అది చింతా చిన్నది అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చింతా చిన్న స్వయంగా నిందితుడిని బుల్లెట్‌పై ఎక్కించుకొని వెళ్లి ఉండొచ్చని భావన వ్యక్తమవుతోంది. అయితే దీనికి సంబంధించి నిజనిజాలు విచారణలో వెలుగులోకి వస్తాయి.

ప్రణాళిక ప్రకారమే..

ప్రణాళిక ప్రకారమే..


భాస్కరరావు హత్య ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు నాలుగైదు రోజుల ముందు నుంచి రెక్కీ నిర్వహించారని తెలుస్తోంది. హత్యలో నలుగురు పాల్గొన్నారని, వారి వయస్సు కూడా 18 నుంచి 22 ఏళ్లలోపు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు కత్తితో దాడి చేయగా.. మరో ఇద్దరు ప్రధాన రహదారి వద్ద బైకులతో వేచి ఉన్నారని సీసీ పుటేజీ ద్వారా తెలుస్తోంది.

అందరూ చూస్తుండగానే..

అందరూ చూస్తుండగానే..


సోమవారం ఉదయం 11.30 గంటలకు కోనేరు సెంటర్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో దాడి జరిగింది. ఇద్దరు ఆగంతకులు నిల్చొన్న భాస్కరరావును తోసేయగా.. కింద పడిపోయాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఛాతిలోకి పొడిచారు. కత్తి పోట్లకు జేబులో ఉన్న మొబైల్ పేలిపోయింది. ఒంటిపై ఉన్న చొక్కా కాలి.. శరీరంపై గాయాలు ఏర్పడ్డాయి. గుండెలో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో.. ఆస్పత్రికి తరలించే మార్గంలో భాస్కరరావు చనిపోయారు.

తండ్రి, కుమారుడు కూడా..

తండ్రి, కుమారుడు కూడా..


మోకా భాస్కరరావు, అతని తండ్రి మోకా రామయ్య.. పేర్ని నాని కుటుంబానికి అండగా ఉంటున్నారు. నాని తండ్రి, మాజీమంత్రి పేర్ని కృష్ణమూర్తికి రామయ్య అనుచరుడిగా ఉన్నారు. రామయ్య కౌన్సిలర్‌గా పనిచేశాడు. తర్వాత భాస్కర్ రావు తన భార్యను కౌన్సిలర్‌గా గెలిపించుకున్నాడు. తన సామాజికవర్గం కోసం పాటుపడుతూ.. రాజకీయంగా ఎదుగుతున్న భాస్కర్‌రావుపై ప్రత్యర్థులు మట్టుబెట్టారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+