వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎమ్మెల్యేకు వీర మహిళల షాక్ - సీఎం పర్యటన వేళ..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలకు సిద్దమవుతున్న పార్టీలు ప్రత్యర్ధి పార్టీలను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నాయి. ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. వైసీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కు అనూహ్య పరిణామం ఎదురైంది. సీఎం జగన్ వదర బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పర్యటించే పి గన్నవరం మండలం జి పెదపూడి వద్దకు జనసేన వీరమహిళలు చేరుకోవాలని ప్రయత్నించారు.

వీర మహిళల నిరసన

వీర మహిళల నిరసన

వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయాలు సరిపోవటం లేదని.. పది వేల రూపాయాలు ఇవ్వాలనే డిమాండ్ తో సీఎంను కలిసేందుకు ప్రయత్నం చేసారు. కానీ, పోలీసుల నిబంధనలతో సాధ్యపడలేదు. దీంతో..అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వాహనాన్ని వీర మహిళలు అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేసారు. వారి ఆందోళతో కారు దిగి.. ఎమ్మెల్యే వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేసారు. ఆ సమయంలో వారంతా ముఖ్యమంత్రి..వైసీసీకి వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. దీంతో.. ఎమ్మెల్యే రాజా అసహనానికి లోనయ్యారు. వారి పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఎమ్మెల్యే రాజా ఆగ్రహం

ఎమ్మెల్యే రాజా ఆగ్రహం


సమస్య తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటే..రాజకీయాలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పిచ్చి వేషాలెయ్యద్దంటూ హెచ్చరించారు. దీంతో..పోలీసులు జోక్యం చేసుకొని మహిళలను అక్కడ నుంచి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇదే సమయంలో సీఎం పర్యటన పైన జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సైతం కీలక వ్యాఖ్యలు చేసారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన బాధితుల్లో భరోసా నింపలేకపోయిందన్నారు. వరద బాధితులకు ఏం సాయం చేశారో చెప్పకుండా విపక్షాలను విమర్శించటానికే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని ఆరోపించారు.

ఎంపిక చేసిన వారితోనే మాటలు

ఎంపిక చేసిన వారితోనే మాటలు

ముందుగా ఎంపిక చేసిన వారితోనే ముఖ్యమంత్రి మాట్లాడారని.. వేరే వాళ్ల నుంచి కనీసం వినతి పత్రాలు కూడా తీసుకోలేని స్థితిలో సీఎం ఉన్నారన్నారు. ప్రభుత్వం చేసిన సాయం చూసి నోరు లేని పశువులు కూడా ఆనందిస్తాయని ముఖ్యమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు తక్షణ సాయం అందించాలని డిమాండ్‌ చేసిన వీర మహిళలను అవమానించేలా మాట్లాడటం బాధాకరమన్నారు. పొరుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ పరిహారం అందిస్తుంటే.. ఇక్కడ మాత్రం రూ.2 వేలు ఇవ్వటం దుర్మార్గమన్నారు.

English summary
Janasena Veera Mahila prtoest, YCP MLA JAkkampudi Raja serious at the tiem of CM JAgan visist in flood effected areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X