ఆ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ వైపు చూస్తున్నారా..?
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘెర ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలైన గేమ్ చేంజర్‌గా నిలిచారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది.

ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అరకు ఎంపీ చెట్టి తనూజారాణి బీజేపీతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ గుర్తు మీద గెలిచిన ఓ వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ నుంచి గెలిచిన 11 ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్యే విరుపాక్షి కూడా ఒకరు. ఆయన కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయన టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఉండడం వల్ల తమ పనులు జరగవనే అభిప్రాయంతో టీడీపీలో చేరేందుకు విరూపాక్షి సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది . తాను పార్టీ మారడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పు వార్తలు పెద్ద ఎత్తున వస్తుండడంతో, ఇటీవల జగన్‌ను కలిసిన విరుపాక్షి తాను పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వైసీపీని వీడి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ ఐదేళ్లు ప్రజల మధ్యన ఉండి తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications