వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మెల్యే.. హోం మంత్రి కాదు!
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పైన వైఎస్ఆర్సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంగలపూడి అనిత హోం మంత్రిగా తన బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారా అంటూ ప్రశ్నించారు.
వంగలపూడి అనిత ను టార్గెట్ చేసిన వరుదు కల్యాణి
నేడు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హోం మంత్రి వంగలపూడి అనిత ఎప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అంతకుమించి ఆమె మరే పని చేయడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని, అయినా వాటిపైన ఆమె స్పందించడం లేదని నిప్పులు చెరిగారు.

అనిత ఓ అసమర్థ హోం మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాదాల ఘటనలు జరుగుతున్న ఆమెకు పట్టింపు లేదని విమర్శించారు.. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా అంటూ నిలదీశారు. అనకాపల్లి సినర్జీస్ ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వరుదు కళ్యాణి మండిపడ్డారు. వంగలపూడి అనిత భాష చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని అనిత ఓ అసమర్థ హోం మంత్రి అంటూ వరుదు కళ్యాణి ఆరోపించారు.
పేపర్లకు ఉన్న విలువ కార్మికుల ప్రాణాలకు లేదా
హోం మంత్రి కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు .మదనపల్లిలో పేపర్లు తగలబెడితే హెలికాప్టర్ పంపారని ఇక ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాల కోసం ఒక హెలికాప్టర్ కూడా పంపలేదని వరుదు కళ్యాణి పేర్కొన్నారు. పేపర్లకు ఉన్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా అంటూ ఆమె ప్రశ్నించారు.
సన్మానాల మీద ఉండే శ్రద్ధ సమస్యలపై లేదు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప మరి ఏమి పని లేనట్టు అనిత ప్రవర్తన ఉందని పేర్కొన్న వరుదు కళ్యాణి ఇప్పటికైనా జగన్ పై విమర్శలను పక్కనపెట్టి అగ్ని ప్రమాదాల నివారణ పై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. వంగలపూడి అనితకు సన్మానాలు మీద ఉండే శ్రద్ధ సమస్యల మీద లేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. వంగలపూడి అనిత నోటికొచ్చినట్టు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని వరుదు కళ్యాణి పేర్కొన్నారు.
వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మెల్యే అంటూ టార్గెట్
వంగలపూడి అనిత పాయకరావు పేట ఎమ్మెల్యే అని, ఆమె హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వర్తించడం లేదు కాబట్టి ఇకపై ఆమెను అలా సంబోధిస్తామని వరుదు కళ్యాణి సెటైర్లు వేశారు. ఇక వంగలపూడి అనిత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే అంటూ సంబోధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వరుదు కళ్యాణి వంగలపూడి అనిత ను టార్గెట్ చేసి మాటకు మాట సమాధానం చెప్పారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications