నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోటంరెడ్డి స్థానంలో కొత్త ఇంఛార్జ్ ఫిక్స్ - బంపరాఫర్ : నెల్లూరు లో మారుతున్న సీట్లు..!?

నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నియామకం. జిల్లా పార్టీలో కీలక మార్పుల దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు జిల్లాపై ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ చేసారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్ ఖరారయ్యారు. ఇప్పటికే ఆనం రామానారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరిలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని ఇంఛార్జ్ గా ప్రకటించారు. ఇప్పుడు సొంత ప్రభుత్వం పైన సంచలన ఆరోపణలు చేసిన కోటంరెడ్డి స్థానంలో నెల్లూరు రూరల్ కు కొత్త ఇంఛార్జ్ ను నియమించారు. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నెల్లూరు రీజనల్ ఇంఛార్జ్ బాలనేని సుదీర్ఘంగా ఎంపీ ఆదాలతో చర్చలు చేసారు. ఆ తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా.. రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా అసెంబ్లీ సీట్లలో అభ్యర్ధుల మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.

కోటంరెడ్డి స్థానంలో ఆదాల నియామకం

కోటంరెడ్డి స్థానంలో ఆదాల నియామకం


నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ ఖరారు చేసారు. పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ సొంత ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసిన కోటంరెడ్డి వ్యవహారాన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. తనతో పాటుగా పలువురి గురించి ప్రస్తావిస్తూ వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ ఆరోపణలు చేయటం పైన అధికారులు..పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ట్యాపింగ్ ఆరోపణల పైన అధికారులు ఫోకస్ చేసారు. కోటంరెడ్డి ఎవరితో మాట్లాడారో వారి నుంచి పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో నెల్లూరు వైసీపీ రీజనల్ ఇంఛార్జ్.. మాజీ మంత్రి బాలినేని ముఖ్యమంత్రి సూచనల మేరకు ఎంపీ ఆదాలతో చర్చించారు. నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకొనేలా ఒప్పించారు. ఇప్పుడు సీఎంతో భేటీ కానున్నారు. ఇక నుంచి నియోజకవర్గం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని ఆదాలకు సూచనలు అందాయి.

ఆదాలకు బంపరాఫర్.. గెలవాల్సిందే

ఆదాలకు బంపరాఫర్.. గెలవాల్సిందే


తమ పార్టీ నుంచి గెలిచి తమనే ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన కోటంరెడ్డి టార్గెట్ గా వైసీపీ నాయకత్వం వ్యూహాలు సిద్దం చేస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎంపీ ఆదాలను వ్యూహాత్మకం గానే నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ గా పార్టీ ఖరారు చేసింది. పలుమార్లు ఎమ్మెల్యేగా..ఎంపీగా పని చేసిన ఆదాలకు తాజా పరిణామాల్లో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమయ్యారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తానని చెబుతున్న వేళ..కోటంరెడ్డి పైన వైసీపీ అభ్యర్ధిగా ఆదాల పోటీ చేయటం ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టాలని ఆదాలకు సూచించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆదాలకు మంత్రి పదవి ఇస్తామని వైసీపీ ముఖ్య నేతల నుంచి ఆఫర్ అందినట్లు విశ్వసనీయ సమాచారం.

నెల్లూరులో మారుతున్న సీట్లు..

నెల్లూరులో మారుతున్న సీట్లు..


నెల్లూరు వైసీపీలో వచ్చే ఎన్నికల్లో సీట్లు..అభ్యర్ధులు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయగిరి నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. నెల్లూరూ రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..నెల్లూరు లోకసభకు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీకి దిగటం ఖాయమని చెబుతున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి పార్టీలో పరిస్థితుల గురించి ఓపెన్ గా మాట్లాడుతన్న వేళ..ఆయన రూటు పైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే మేకపాటి కుటుంబం నుంచి ఆత్మకూరు ఎమ్మెల్యేగా విక్రమ్ ఉన్నారు. జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పార్టీ వ్యవహారాల్లో కొంత కాలంగా అంటీ ముట్లనట్లుగా వ్యవహరిస్తున్నారని అధినాయకత్వం గుర్తించింది. దీంతో..రానున్న ఎన్నికల కోసం పార్టీ కంచుకోట నెల్లూరులో సీఎం జగన్ ఎటువంటి ఆపరేషన్ ప్రారంభిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Nellore MP Adala Prabhaar Reddy Appointed as Nellore Rural Assembly Incharge in place of Kotamreddy Sridhar Reddy as party Reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X