ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో -గొయ్యి తవ్వి రెడీగా : జగన్ పై బీజేపీ కీలక నేత సంచలనం..!!
వైసీపీ వర్సెస్ బీజేపీ వార్ ముదురుతోంది. జగన్ బెయిల్ గురించి బీజేపీ కీలక నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ-వైసీపీ మధ్య అధికారంగా కాకపోయినా..మైత్రి కంటిన్యూ అవుతోంది. అయితే, సడన్ గా వ్యూహం మార్చిన బీజేపీ ఇప్పుడు అటు ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో పోలవరం-ప్రత్యేక హోదా కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఏపీలో బిజేపీ నేతలు ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలు..వ్యాఖ్యలతో సీఎం జగన్ సీరియస్ అయ్యారు.

పేర్ని నాని వ్యాఖ్యలతో దుమారం..
దీంతో..తాజా మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని బీజేపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టి..కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తిని సీఎం చెయ్యాలని చూస్తుంది అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించటంతో ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలు స్పందించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవథర్ దీనికి స్పందిస్తూ ట్వీట్ చేసారు. అందులో జగన్ బెయిల్ గురించి ప్రస్తావించి సంచలనానికి తెర తీసారు. మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదని..ఆ ఆలోచన కూడా మాకులేదంటూ సునీల్ దేవథర్ తన ట్వీట్ లో స్పష్టం చేసారు .
జగన్ బెయిల్ పైన సంచలన వ్యాఖ్యలు..
ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక.. రోజు గడవడానికి అప్పు పుట్టక,..రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అది చాలదన్నట్టు వేలకోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారని కామెంట్ చేసారు. కేంద్రం అప్పులు చేసినా కోట్ల మందికి ఉచితంగా రేషన్, వ్యాక్సిన్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మీకు పోలికేంటని ప్రశ్నించారు. కేంద్రానికున్న ఆర్థిక స్థోమత,వెసులుబాటు మీ ప్రభుత్వానికున్నదా అంటూ నిలదీసారు.

ఏపీని ముంచుతున్నారంటూ తీవ్రంగా..
మీలా పప్పు బెల్లాలు పంచడానికి అప్పులు చేయడం లేదని, మేం దేశ ప్రతిష్ట పెంచుతుంటే మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారుంటూ సునీల్ దేవథర్ వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం స్పందించారు. మంత్రి నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం లేకపోయినా సమాజానికి సేవ చేయాలని..రాజకీయాలు నడిపితే సోషల్ వర్కర్ ఎలా అవుతారని ప్రశ్నించారు. కాని బిజెపి వేరు.. సామాజిక సేవ చేయడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు.

డీస్టేబులైజ్ చేస్తున్నారంటూ బీజేపీ నేతలు..
బీజేపీ ప్రజల పక్షాణ పోరాడుతుంటే వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికార పార్టీ కంగారు పడిందో,ఆశీర్వదించిందో తెలీదు కానీ డి స్టేబులైజ్ చెయ్యేడానికి ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేస్తే వైసీపీ నాయకులు కంగారు పడుతున్నారని ఎద్దేవా చేసారు. మూడు రోజుల్లో ఇంకేదో జరిగిపోతుందని మరొకరు అంటన్నారంటూ పేర్కొన్నారు. వేగంగా వెళితేనే అధికార పార్టీలో కుదుపు వచ్చింది..అధికార పార్టీ కంగారు పడిపోతుందంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు.
జీవీఎల్ నరసింహారావు
ఇక ఇదే అంశంపై ఏపీ బీజేపీ నేత రాజ్యసభసభ్యులు జీవీఎల్ నరసింహారావు కూడా తనదైన శైలిలో స్పందించారు. ఆడలేక మద్దెల మీదపడి ఏడ్చినట్లుంది వైసీపీ వ్యవహారం సీఎం జగన్ గారు అంటూ సెటైర్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు తీర్చలేక, కేంద్రంపై నిందలు మోపీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు.

జగన్-మోదీ
ఇక బీజేపీ- వైసీపీ రాజకీయ యుద్దం తప్పదా..
అయితే, బీజేపీ నేతలు ఇప్పుడు జగన్ బెయిల్ అంశం తో పాటుగా ఏపీ ఆర్దిక పరిస్థితి.. పథకాల అమలు గురించి ప్రస్తావించటంతో దీని పైన మంత్రులు రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక విధంగా, వైసీపీ -బీజేపీ మధ్య సంబంధాలపైన ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇక, పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 13వ తేదీతో ముగియనున్నాయి. వైసీపీ ఏం అడిగినా..కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవటం పైన వైసీపీ నేతలు అసహనంగా ఉన్నారు.
Recommended Video

తాము సహకరించినా..బీజేపీ నుండి లేదంటూ..
తాము అన్ని విషయాల్లో మద్దతుగా నిలిచినా..ఆ విధమైన రెస్పాన్స్ బీజేపీ నుంచి లేకపోవటంతో..మరింత కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వైసీపీ నేతల నుంచి వ్యక్తం అవుతోంది. రఘురామ రాజు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పైన కోర్టు తీర్పు రావాల్సి ఉంది. ఇప్పుడు బీజేపీ నేతలు సైతం జగన్ బెయిల్ అంశాన్ని ప్రస్తావించటం వైసీపీ నేతలకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో..వైసీపీ-బీజేపీ మధ్య సంబంధాలు బెడిసికొడుతున్నాయనే అభిప్రాయం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ పోరు ఏ మలుపు తీసుకుంటుందో అనే అంశం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications