ప్రేమకు నో: ఉరేసుకొని ప్రేమజంట ఆత్మహత్య (పిక్చర్స్)

వరంగల్/కరీంనగర్: ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్న జంటకు పెద్దలు అడ్డు చెప్పడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం వరికోలుకు చెందిన కీసర లచ్చయ్య, లచ్చమ్మ మొదటి కొడుకు కుమార్ (17) బెజ్జంగిలో ఇంటర్ చదువుతున్నాడు.

గ్రామానికే చెందిన ఎల్లయ్య, ప్రేమలతల మొదటికూతురు జయశ్రీ (16) ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దల ముందు రెండు కుటుంబాల మధ్య పలుమార్లు పంచాయతీ నిర్వహించడంతో పాటు వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కుమార్, జయశ్రీ బుధవారం వరంగల్ జిల్లా చేర్యాలకు చేరుకున్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వెనుక భాగంలో ఓ వేపచెట్టుకు చున్నీలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం ఓ ట్రాక్టర్ డ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.

ఆత్మహత్య

ఆత్మహత్య

తమ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో విరక్తి చెంది కుమార్, జయశ్రీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఇరు కుటుంబాలలో తీరని శోకాన్ని నింపింది.

ఆత్మహత్య

ఆత్మహత్య

కుమార్, జయశ్రీల మధ్య కొన్నాళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరుకావడంతో పాటు మైనర్లు అవడంతో కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పారిపోయి వివాహం చేసుకుని జీవిద్దామనుకుని ఈ నెల 10వ తేదీన సొంతూరు వరికోలు నుంచి తప్పించుకుని వచ్చారు.

ఆత్మహత్య

ఆత్మహత్య

ఈ క్రమంలో గురువారం చేర్యాల శివారులోని గురుకుల పాఠశాల సమీపంలోని ఓ చెట్టుకు చున్నీ, స్కార్ప్‌లతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని విగత జీవులుగా కనిపించారు.

ఆత్మహత్య

ఆత్మహత్య

మృతుడి జేబులో లభించిన పర్సు, సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు మృతుల వివరాలను కనుగొని విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి తండ్రి లచ్చయ్య ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటుండగా, తల్లి, కుటుంబ సభ్యులు చేర్యాలకు చేరుకున్నారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. పోలీసులు అడ్డుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం జరిపిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+