పోలీసుల నుండి తప్పించుకోబోయి యువకుడు మృతి
కర్నూలు: పోలీసుల నుండి తప్పించుకోబోయి ఓ యువకుడు కిందపడి మరణించాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్న తుంబళంలో జరిగింది. బొమ్మా - బొరుసు ఆడుతున్న వారి పైన పోలీసులు దాడి చేశారు. వారి నుండి తప్పించుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. దీంతో ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు.
లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృతి
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం రామ్‌నగర్ వద్ద మంగళవారం ఉదయం బైక్, లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
నలుగురి సజీవదహనం కేసులో నిందితుడు అరెస్ట్

అల్లుడే కాలయముడై అత్తమామల సహా ఇద్దరు బావమరుదులను సజీవదహనం చేసిన ఘటనలో నిందితుడిని సోమవారం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ-అన్నవరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణంలో నిందితుడు రవి విజయవాడలోని ప్రజాశక్తి నగర్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా మాచవరం పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది. అతడి శరీరంపై కాలిన గాయాలుండడం, పొంతన లేని సమాధానాలివ్వడంతో అను మానించిన పోలీసులు అతడిని ప్రశ్నించారు.
ఆయిల్ ట్యాంకర్ల కార్మికుల ధర్నా
కరీంనగర్ జిల్లా రామగుండం మండలం కుందనపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపో ఎదుట ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లు మంగళవారం ఉదయం ఆందోళన ప్రారంభించారు. తమ డిమాండ్లను పరిష్కరించనందుకు నిరసనగా ధర్నా ప్రారంభించినట్లు కార్మికులు తెలిపారు. వీరి ఆందోళన ఫలితంగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు ఆయిల్ ట్యాంకర్ల రవాణా నిలిచిపోయింది.
ట్యాంకర్ బోల్తా పడి డీజిల్ నేలపాలు
వరంగల్ జిల్లా మంగపేట మండలం రాజుపేట వద్ద మంగళవారం వేగంగా వెళ్తున్న ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో వేలాది లీటర్ల డీజిల్ నేలపాలైంది.












Click it and Unblock the Notifications