జగన్ ఆస్తుల కేసు: రత్నప్రభకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఐఎఎస్ అధికారి రత్నప్రభకు హైకోర్టులో ఊరట లభించింది. ఇందూటెక్ చార్జిషీట్‌లో ఆమె పేరును సిబిఐ ఏడవ నిందితురాలిగా చేర్చింది. ఈ చార్జిషీట్‌ను సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
జగన్ కేసులోని ఇందూటెక్ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో తన పేరును నిందితురాలిగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ రత్నప్రభ హైకోర్టుకు వెళ్లారు. ప్రాసిక్యూషన్ అనుమతి రాకుండా చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడాన్ని రత్నప్రభ సవాల్ చేశారు.

ఇందూటెక్ ప్రాజెక్టుకు శంషాబాద్ ప్రాంతంలో భూమి కేటాయింపుపై సిబిఐ దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ భూమి కేటాయింపులో తనకు ఏలాంటి సంబంధం లేదని రత్నప్రభ వాదించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను అనుసరించానని, అంతకు మించి తనకు సంబంధం లేదని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ కేటాయింపు జరిగింది.
నిరుడు సెప్టెంబర్‌లో వైయస్ జగన్‌కు బెయిల్ లభించడానికి ముందు సిబిఐ మూడు చార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది. నెల రోజుల తర్వాత ఆ చార్జిషీట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ మూడు చార్జిషీట్లలో ఇందూటెక్ చార్జిషీట్ ఒక్కటి.
ఇందూటెక్ జోన్ అభియోగపత్రంలో జగన్, విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, బిపి ఆచార్య, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఏపీఐఐసీ మాజీ సలహాదారు దామెర పార్థసారధిరావు, ఇందూ గ్రూప్ చార్టెడ్ అకౌంటెంట్ కోటేశ్వరరావులు నిందితులుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications