Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ లో అనూహ్య మార్పు- పార్టీ నేతలకు హామీ..!!

జగన్ కు భారీ ఓటమి ఒక గుణపాఠంగా మారుతోంది. తనకు ఎదురు లేదని భావించిన జగన్ ను జనం తిరస్కరించారు. సంక్షేమ జపం మాత్రమే తాము కోరుకోవటం లేదని తమ తీర్పుతో స్పష్టం చేసారు. సీఎం గా అన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన స్థాయిలో కొన్నింటికి పరిమితం కావటంతో ప్రజాభిమానం కోల్పోయారు. 151 సీట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజలే 11 సీట్లకు పడేసారు. దీంతో, జగన్ లో ఆలోచన మొదలైంది. మార్పు కనిపిస్తోంది. పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.

ఊహించని ఫలితంతో
ఒక్క ఛాన్స్ అంటూ 2019లో జగన్ 151 సీట్లతో విజయం సాధించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేసారు. చిన్న వయసులో అంత మంచి ప్రజా మద్దతుతో అధికారం దక్కించుకున్న జగన్ పైన భారీ అంచనాలు కనిపించాయి. కానీ, జగన్ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్లారు. ప్రజాభిప్రాయం..కనీసం మంత్రివర్గంలో చర్చ కూడా లేకుండా రాజధాని మార్పు..మూడు రాజదానుల పేరుతో తొలి ఏడాదిలో సందిగ్ధతకు కారణమయ్యారు. న్యాయ సలహాలు కూడా పరిగణలోకి తీసుకోలేద. ఫలితంగా రాజధాని లేని రాష్ట్రం చేసారనే ప్రచారం ఏపీతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిలో జగన్ పైన ఆగ్రహం పెంచింది.

YS Jagan clarifies his action plan after election defeat made key assurance

ఓటమి వెను కారణాలతో
సంక్షేమం, బటన్లు నొక్కటం మినహా రాష్ట్ర భవిష్యత్ గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కొందరిని దగ్గర చేసుకొనేందుకు మరి కొందరనికి దూరం చేసుకున్నారు. నమ్మిన కోటరీ సలహాదారులు వాస్తవాలు జగన్ వద్దకు చేరకుండా భారీ నష్టానికి కారకులయ్యారు. జగన్ సీఎం అయ్యాక జనంతో దూరం అయ్యారు. తన పథకాలు, వాలంటీర్లతో తాను జనంతోనే ఉన్నట్లు భావించారు. పార్టీని పూర్తిగా విస్మరించారు. ఎమ్మెల్యేలకు అప్పాయింట్ మెంట్లు దొరకలేదు. కొందరి నేతలు అతి ప్రవర్తన..దూషణ పర్వం...దాడులు మరింత ఆగ్రహం పెంచాయి. చేసిన పనులు జగన్ చెప్పుకోలేక పోయారు. వ్యతిరేక ప్రచారం తిప్పి కొట్టటంలో విఫలమయ్యారు. ఉద్యోగుల విషయంలో సలహాదారు అతి ప్రవర్తన వారిని మొత్తానికే దూరం చేసింది.

ఇక అందుబాటులోనే
ఎవరు దూరం అయినా..తాను ఇచ్చే సంక్షేమంతో గెలుస్తాననే భ్రమలో జగన్ కనిపించారు. ఇక..ఫలితాల తరువాత జగన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రతిపక్ష పాత్ర కొత్తది కాదని చెప్పారు. ముందుగా పార్టీ కేడర్ పైన జరుగుతన్న దాడుల వేళ కేడర్ కు మద్దతుగా నిలవాలని సూచించారు. పార్టీ కార్యాలయం తాను ఉంటున్న పాత క్యాంపు ఆఫీసుకు మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇక,తాను నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అందరం కలిసి ప్రజల కోసం నిలబడదామని పిలుపునిచ్చారు. ఓటమి కారణాలు ఏమైనా..భవిష్యత్ మనదే అంటూ భరోసా కల్పించారు. త్వరలో నియోజకవర్గాల ఇంఛార్జ్ లు, పార్టీ నేతలతో జగన్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+