ఏఎన్-32 ఆచూకీ తెలియదు: విమానాలు నడిపే తీరు సరిగా లేదన్న జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: కుటుంబ పెద్ద ఆచూకీ దొరక్కుంటే ఆ బాధ తనకు తెలుసని వైసీపీ అధినేత వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. అదృశ్యమైన ఏఎన్-32 విమాన సంఘటనలో బుచ్చిరాజుపాలెం నమ్మి చిన్నారావు కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. చిన్నారావు భార్య నమ్మి పైడి తల్లమ్మతో మాట్లాడారు.

అదృశ్యమైన ఏఎన్-32 విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అధైర్యపడవద్దని వారికి సూచించారు. నా తండ్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ మిస్ అయినప్పుడు తాము కూడా చాలా టెన్షన్‌కు గురయ్యామని, ఆరోజు ఎంతో బాధను అనుభవించానని జగన్ చెప్పారు.

దేశంలో విమానాలు నడిపే తీరు సరిగా లేదని అన్న జగన్ సైనిక విమానాల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే సాధారణ విమానాల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. విమాన ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

దీనిపై రక్షణ శాఖకు లేఖ రాస్తానని అన్నారు. చిన్నారావు తిరిగి రావాలని చెప్పిన జగన్, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. అదృశ్యమైన విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు.

అదేవిధంగా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని జగన్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పైడి తల్లమ్మతో కొడుకులు, కూతురు గురించి ఆరా తీశారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి చదువు విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు.

ఏ రకమైన అవసరమొచ్చినా మా నాయకులకు తెలియ జేయాలని వారి ఫోన్‌ నంబర్లు రాసి ఇచ్చారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా తమవారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.

వైయస్ జగన్ విశాఖ పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కర్త మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కరణ ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

విమాన గాలింపు ప్రాంతాన్ని విస్తరిస్తున్నాం: కోస్టు గార్డు ఐజీ

విమాన గాలింపు ప్రాంతాన్ని విస్తరిస్తున్నాం: కోస్టు గార్డు ఐజీ


నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతంలో అదృశ్య‌మైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం ఆచూకీపై కోస్టు గార్డు ఐజీ రంజ‌న్ బ‌ర్‌గోత్రా సోమవారం మీడియాతో మాట్లాడారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. విమానం ఆచూకీ గురించి త‌మ‌కు ఇంకా తెలియ‌లేద‌ని, శిథిలాల‌ను కూడా ఇప్పటివరకు క‌నిపెట్ట‌లేక‌పోయామ‌ని పేర్కొన్నారు.

 విమాన గాలింపు ప్రాంతాన్ని విస్తరిస్తున్నాం: కోస్టు గార్డు ఐజీ

విమాన గాలింపు ప్రాంతాన్ని విస్తరిస్తున్నాం: కోస్టు గార్డు ఐజీ


నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, కోస్టుగార్డు సంయుక్తంగా సెర్చ్ ఆప‌రేష‌న్ బృందాల‌తో కలసి విమానం కోసం విస్తృతంగా గాలింపు చేస్తున్న‌ట్లు ఆయన తెలిపారు. నౌకాద‌ళానికి చెందిన 16 నౌకలు, 13 విమానాలు, 4 హెలికాప్టర్లు గాలింపు చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయ‌ని రంజ‌న్ బ‌ర్‌గోత్రా చెప్పారు.

 విమాన గాలింపు ప్రాంతాన్ని విస్తరిస్తున్నాం: కోస్టు గార్డు ఐజీ

విమాన గాలింపు ప్రాంతాన్ని విస్తరిస్తున్నాం: కోస్టు గార్డు ఐజీ


ప్రస్తుతం ఇస్రో సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. విమానం అదృశ్య‌మయింద‌ని భావిస్తోన్న ప్రాంతాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని ఆదేశించి విమానాల‌ను పంపామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. విమాన గాలింపు చేస్తున్న ప్రాంతాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. విమాన శకలాలు లభించినట్లు వస్తోన్న వార్తలను ఆయన కొట్టేశారు.

 విమాన గాలింపు ప్రాంతాన్ని విస్తరిస్తున్నాం: కోస్టు గార్డు ఐజీ

విమాన గాలింపు ప్రాంతాన్ని విస్తరిస్తున్నాం: కోస్టు గార్డు ఐజీ


చివరి ప్రయత్నంగా విదేశాల సహకారం తీసుకుంటామని ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29 మంది ఉన్నారు. గల్లంతయిన వారిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్న సంగతి తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysr congress party president ys jagan console to chinna rao family in visakhapatnam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి