వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే, తొలి అస్త్రంగానే చంద్రబాబు: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

అద్దంకి: ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, హోదావల్ల రాయితీలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని, ఊసరవెల్లికే రంగులు మార్చడం నేర్పుతున్నారని ఆయన అన్నరు.

హోదా కోసం ఆఖరి అస్త్రంగా మంత్రులతో రాజీనామాలు చేయిస్తానని చంద్రబాబు చెబుతున్నారు గానీ ఇ్పపటికే నాలుగేళ్లు గడిచాయి కాబట్టి ఆఖరి అస్త్రంగా కాకుండాతొల అస్త్రంగానే రాజీనామాలు చేయించాలని అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి బహిరంగ సభలో ఆదివారం ఆయన మాట్లాడారు.

రేపు ఢిల్లీలో ధర్నా చేస్తారు

రేపు ఢిల్లీలో ధర్నా చేస్తారు

హోదా కోసం రేపు తమ పార్టీ నాయకులు ఢిల్లీలో ధర్నా చేస్తారని, మంగళవారం నుంచి పార్లమెంటు వేదికగా తమ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని జగన్ చెప్పారు. అప్పటికీ కేంద్రం దిగి రాకపోతే మార్చి 21వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని, అయినా కేంద్రం దిగి రాకపోతే ఏప్రిల్ 6వ తేదీన ఎంపీలు రాజీనామా చేస్తారని అన్నారు.

పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే...

పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే...

చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ది ఉంటే అవిశ్వాసానికి టిడిపి ఎంపీలతో మద్దతు ఇప్పించాలని జగన్ డిమాండ్ చేశారు. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా అని ఆయన అడిగారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఎంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబుతో కరువు వచ్చింది

చంద్రబాబుతో కరువు వచ్చింది

చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతోందని, ఆయనతో పాటు ఎపికి కరువు వచ్చిందని జగన్ అన్నారు. చంద్రబాబుతో పాటు క్రమం తప్పకుండా ప్రతి ఏడు కరువు అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిందని అన్నారు. రబీ పంటకు 71 శాతం లోటు ఉన్న పరిస్థితుల్లో రైతన్నలను ముఖ్యమంత్రి ఆదుకోవాలని ఆయన కోరారు.

ఓటుకు నోటు కేసు వల్ల

ఓటుకు నోటు కేసు వల్ల

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన టేపులు తెలంగాణ వద్ద ఉన్నాయని జగన్ అన్నారు. అందుకే ఎ విషయంలోనూ నోరు తెరిచి ప్రశ్నించే స్థితిలో చంద్రబాబు లేరని, ఏమైనా అడిగితే తనను జైలుకు పంపిస్తారేమోననే భయం చంద్రబాబులో కనిపిస్తోందని అన్నారు. కేసుల్లో ఇరుక్కుపోయిన వ్యక్తి కనుక కేంద్ర ప్రభుత్వాన్ని ఏపి ప్రయోజనాలపై ప్రశ్నించే సాహసం చేయలేరని అన్నారు.

English summary
The YSR Congress party president YS Jagan demandd Telugu Desam Party chief and Nara Chandrababu Naidu to ask the resignations of his party ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X