ఈ రాత్రికి ఇరాన్ ను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్‌ బిగ్‌ వార్నింగ్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ లోని చమురు గ్యాస్‌ ఇన్‌ ఫ్రా మార్కెట్లను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.


ఇరాన్ కు చెందిన నౌకాదళం, వైమానిక దళం, రాడార్‌ వ్యవస్థలను ఇప్పటికే కూల్చేశామని అన్నారు. త్వరలోనే ఇరాన్ వ్యూహాత్మక ఖర్గ్ ఐలాండ్ ను కూడా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. వెనెజూలాలో చేసిన విధంగా ఇరాన్ పై అమెరికా ఆపరేషన్ చేపడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.

వెనిజులాలో చెప్పినట్లుగానే ఇరాన్ విషయంలోనూ చమురు నియంత్రణ చేపడతామని.. ఇది అమెరికాకు.. ఇరాన్ మార్కెట్ కు సరికొత్త మలుపు అవుతుందని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలు బలహీనపడ్డాయని సులభంగానే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఈ రాత్రికి అమెరికా సైన్యం ఇరాన్ పై మరింతగా విరుచుకుపడుతుందని.. ఇరాన్ పై శక్తివంతమైన దాడులు చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే సాధారణ ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇరాన్ లోని బ్రిడ్జ్ లు, విద్యుత్ ప్లాంట్లు తదితర పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. మరోవైపు పాకిస్థాన్ రాయబారుల ద్వారా ఇరాన్ తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు.

ఇరాన్ కు వ్యూహాత్మకంగా కీలకమైన ఖర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇది చమురు ధరలపై అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇటీవల అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ ఒమన్ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న క్రమంలో ఇరాన్ కు చెందిన డ్రోన్ దాడి చేసింది.

Trump Issues Stern Warning to Iran Devastating Irreparable Blow Tonight and Seizure of Oil amp amp Gas

ఈ దాడిలో అపాచీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే తమ అపాచీ హెలికాప్టర్ ను కూల్చేసిందని ఆరోపించారు. దీనికి సమాధానంగా ఇరాన్ కు గట్టిగా బదులు చెప్తామన్నారు. ఈ క్రమంలో తాజాగా ఇరాన్ పై ట్రంప్ వార్నింగ్ పశ్చిమాసియాలో ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+