ఇరాన్ తో యుద్ధం వేళ.. లాక్ డౌన్ లోకి అమెరికాలోని పెంటగాన్..!

అమెరికాలోని పెంటగాన్ భవనం గురువారం లాక్‌ డౌన్‌ లోకి వెళ్లింది. భవనంలోని కొన్ని అంతస్తులను అధికారులు ఖాళీ చేయించారు. ఈ విషయాన్ని మీడియా సంస్థలు నివేదించాయి. భవనంలో పలు అంతస్తులు, కారిడార్లను అధికారులు మూసివేశారు. పెంటగాన్ భవనంలో గాలి నాణ్యత సమస్య వచ్చిందని అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి షాన్ పార్నెల్ ధృవీకరించారు.

అధికారులు తనిఖీలు పూర్తయ్యే వరకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆర్లింగ్టన్ ఫైర్, ఈఎంఎస్ బృందాలు అక్కడ పని చేస్తున్నాయి. ప్రమాదకర పదార్థాల నిపుణులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు రెండు నుంచి ఐదు అంతస్తులను, నాలుగు నుండి ఏడు కారిడార్లను మూసివేశారు. పోలీసులు గ్యాస్ మాస్క్‌లతో అక్కడ కనిపించారు.

ప్రస్తుత పరిస్థితులపై భద్రతా బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. దీని కోసం ఒకటి లేదా రెండు గంటలు పట్టొచ్చు. సిబ్బంది భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. అధికారులు భవనంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే రోజు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ పై కఠిన చర్యల గురించి ప్రకటించారు. ఈ రాత్రికి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తామని స్పష్టం చేశారు.

Pentagon Under Lockdown Following Reports of Hazardous Gas Leak Incident at US Defense Headquarters

ఇరాన్ లోని చమురు గ్యాస్‌ ఇన్‌ ఫ్రా మార్కెట్లను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇరాన్ కు చెందిన నౌకాదళం, వైమానిక దళం, రాడార్‌ వ్యవస్థలను ఇప్పటికే కూల్చేశామని.. త్వరలోనే ఇరాన్ వ్యూహాత్మక ఖర్గ్ ఐలాండ్ ను కూడా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఈ రెండు ఘటనలు ఒకే రోజు జరగడం గమనార్హం. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+