జగన్ పిటిషన్: ద్వారంపూడి బంధువులపై ఐటి దాడులు
హైదరాబాద్/ కాకినాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14 నుంచి ఎన్నికల ప్రచారం చేసే, సభల్లో పాల్గొనే వివరాలు తెలుపుతూ ఆయన మెమో దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెబుతూ అందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆయన కోరినట్లు సమాచారం. సీమాంధ్రలో ఆయన విస్తృతంగా పర్యటించాలని అనుకుంటున్నారు.

ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బంధువుల ఆస్తులపై ఆదాయం పన్ను శాఖ (ఐటి) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. కాకినాడలోని సెవన్‌స్టార్, శ్రావణి ఆస్పత్రుల యజమానుల ఇళ్లల్లో, ఆస్పత్రుల్లో అధికారులు సోదాలు చేపట్టారు.
జగన్ అక్రమాస్తుల కేసులో ఇదివరకే ద్వారంపూడిని సిబిఐ అధికారులు విచారించిన నేపథ్యంలో వారి బంధువుల ఇళ్లపై ఐటి దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకంది. ఇటీవలే జగన్‌కు సంబంధించి ఆస్తులను కొంత మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన విషయం తెలిసిందే.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications