మారుతున్నలెక్కల వేళ జగన్ బిగ్ డెసిషన్ - మారిన వ్యూహం, బెంగళూరుకు బై..!?
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయం వేళ కొత్త నిర్ణయాలకు సిద్దం అయ్యారు. స్థానిక ఎన్నికలు ఇప్పుడు కూటమి- వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం పైన కూటమి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దీంతో.. జగన్ అలర్ట్ అయ్యారు. ఈ ఎన్నికల నుంచే పూర్తిగా తన రూటు మార్పు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు పార్టీ ముఖ్యులకు కీలక దిశా నిర్దేశం చేసారు.
ఏపీల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికలను కూటమి- వైసీపీ సెమీస్ గా భావిస్తున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే రెండు వైపులా వ్యూహాలను అమలు చేస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి.. ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయ్యాయి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే అక్కడ నియోజకవర్గ ఇంఛార్జ్ కు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనని జగన్ తేల్చి చెప్పారు. కాగా.. కూటమి నేతలు వైసీపీని రాజకీయం గా అష్ఠదిగ్భంధనం చేసే విధంగా వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. దీంతో... జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి పైనా ప్రజా వ్యతిరేకత ఉందని చెబుతూనే.. పార్టీ కేడర్ ను మరింత అప్రమత్తం చేస్తూ.. వారిలో అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీలోని ముఖ్య నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు.

మారిన వ్యూహం.. కొత్త నిర్ణయాలు
2024 ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ వారంలో మూడు రోజులు తాడేపల్లిలో అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన రోజులు బెంగళూరు వెళ్తున్నారు. గత 27 నెలల కాలంగా ఇదే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారు. పరామర్శలు.. సమస్యల పైన స్పందించే సమయంలోనే జిల్లా యాత్ర లు చేస్తున్నారు. తాడేపల్లిలోనే పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే, మారుతున్న పరిణామాలతో జగన్ తన ఆలోచన మార్చుకున్నట్లు పార్టీ నతేల సమాచారం. అందులో భాగంగా ఇక తాడేపల్లి లోనే అందు బాటులో ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బెంగళూరు కు అప్పుడప్పుడు మినహా.. ప్రతీ వారం వెళ్లేది ఉండదని చెబుతున్నారు. ఎంపిక చేసిన నియోజకవర్గాలు.. జిల్లాల సమావేశాల నిర్వహణ షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ఈ నెల 8న జగన్ పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఆ భేటీలో దీనికి సంబంధించి పూర్తి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.













Click it and Unblock the Notifications