పులివెందులలో జగన్ విజయం..భారీగా తగ్గిపోయిన మెజార్టీ
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ బోణీ కొట్టింది. ఆ పార్టీ తరుఫున అధినేత జగన్ పులివెందుల నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై 61, 176 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. గత రెండు ఎన్నికలతో పోల్చితే జగన్ మెజార్టీ భారీగా పడిపోయింది. 2014 ఎన్నికల్లో జగన్ 75,243 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన 2019లో 90,110 ఓట్లతో ప్రభంజనం సృష్టించారు. ఈసారి కూడా భారీ మెజార్టీతో జగన్ గెలుస్తారని ఆశించారు. అయితే 2014లో వచ్చినన్ని ఓట్లు కూడా ఆయన సాధించలేకపోయారు.ఆయన మెజార్టీ తగ్గడంపై అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సరిగా జరగలేదంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి నేతలు స్పష్టమైన అధిక్యంలో నిలిచారు. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, కీలక నేతలు ఓటమి అంచునా నిలిచారు. ఏపీ మంత్రులుగా ఉన్న వారంతా ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు. వైసీపీ ఓటమి దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ల వారిగా వెలువడుతున్న ఫలితాలను చూస్తే ఇది అర్థమవుతుంది. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications