'ఎవరు తీసుకున్న గోతిలో వారే.. వైయస్ జగన్ మంచి ఉదాహరణ'
అమరావతి: ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారనడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ ఉదాహరణ అని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.
మంగళవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై జగన్ వ్యాఖ్యలు సరికావన్నారు. నోటు రద్దు, అధిక టాక్స్‌లతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిందన్నారు. అంతేగాక సామాన్యుడిలో కొనుగోలు శక్తి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలి: రఘువీరా
సామాజిక న్యాయ, ప్రజాస్వామ్య, లౌకిక సిద్ధాంతాలకు ప్రతినిధిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని టిడిపి బలపరచాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు.
ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను టిడిపి బలపరచడం ఏపీ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమన్నారు. హోదా సాధించేందుకు జగన్ కేంద్రంపై పోరాడాలన్నారు.












Click it and Unblock the Notifications