అమ్మవారి పూజలో జగన్: రైతుల ఫిర్యాదుపై వెంటనే స్పందన
కడప: తెలుగుదేశం ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖరీఫ్‌లో రైతులకు పెట్టుబడులు కూడా దక్కలేదని, రబీ సీజన్‌కు అవసరమైన మేరకు సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

విజయదశమి శుభాకాంక్షలు
ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు గురువారం పులివెందుల, కడప అమ్మవారిశాలల్లో వైయస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పులివెందులలో ఏర్పాటు చేసిన హోమంలో వేదపండితులు జగన్ చేతులమీదుగా సమిధలు వేయించారు. కడపలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రాష్ట్ర ప్రజలకు జగన్ విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.

రైతుల మొర
గురువారం పులివెందుల నుంచి కడపకు వస్తున్న వైయస్ జగన్‌ను పెండ్లిమర్రి విత్తనపు కౌంటర్ వద్ద పలువురు రైతులు కలిసి అందరికీ విత్తనాలు సరఫరా చేయలేదని మొరపెట్టుకున్నారు.

వెంటనే స్పందించారు
వెంటనే స్పందించిన జగన్.. వ్యవసాయాధికారులతో మాట్లాడారు. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయొద్దని సూచించారు.

ప్రజా బ్యాలెట్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని, కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని, రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ సీపీఐ అక్టోబర్ 1 నుంచి ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కడప నగరంలోని చెన్నూరు బస్టాండు వద్ద నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్‌ను జగన్.. బ్యాలెట్ పూరించి బాక్సులో వేశారు. ప్రత్యేకహోదా వస్తేనే నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications