వైసీపీలో జగన్ మార్క్ అభ్యర్థుల మార్పు - ముహూర్తం ఫిక్స్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కానీ క్షేత్రస్థాయిలో వస్తున్న నివేదికల ఆధారంగా ప్రధాన పార్టీలో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తుంది. ఇండియా కూటమిలో మార్పులు చేస్తున్న వేళ.. వీటికి అనుగుణంగా వైసిపి లోను కొందరు అభ్యర్థుల మార్పు తప్పదని సమాచారం.
హోరాహోరీ
ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతుంది. జగన్ ఓడించడమే లక్ష్యంగా మూడు పార్టీల కూటమి బరిలోకి దిగింది. మూడు పార్టీల నుంచి ఇప్పటికే సీట్లు అభ్యర్థుల పైన స్పష్టత వచ్చింది. కానీ సర్వే నివేదికల ఆధారంగా కొందరు అభ్యర్థుల మార్పుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఒకటి రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి, అనంత జిల్లాలో మార్పులు ఉంటాయని చెప్తున్నారు. మార్చాల్సిన అభ్యర్థులు, కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపైన ఇప్పటికే సర్వే సంస్థ ద్వారా కూటమి నేతలు సమాచారం సేకరిస్తున్నారు. మార్చాల్సిన నియోజకవర్గం ముందుగానే నేతలతో విషయాలను వివరించి ఆ తర్వాత నిర్ణయం ప్రకటించేలా కసరత్తు జరుగుతుంది.

అభ్యర్థుల మార్పు
ఇదే సమయంలో వైసీపీలోను కొందరు అభ్యర్థుల మార్పు తప్పదని సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి జగన్ దాదాపు 80 మంది సెట్టింగ్ స్థానాల్లో మార్పులు చేశారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో జగన్ బస్సు యాత్ర పూర్తయింది. అటు ఎన్నికల ప్రచారం చేస్తూనే ఇటు క్షేత్రస్థాయిలో అభ్యర్థుల పనితీరు.. ప్రచార్తి పార్టీల బలబలాల పైన ఆరా తీస్తున్నారు. ప్రధానంగా గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు స్థానాల్లో మార్పులు ఉంటాయని పార్టీలో చర్చ జరుగుతుంది. ఒక ఎంపీ అభ్యర్థిని సైతం మారుస్తారని తెలుస్తోంది.
జగన్ నిర్ణయం ఏంటి
అభ్యర్థులను మార్చిన సమయంలో సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా.. క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం లేకుండా ఆచితూచి వ్యవహరించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రాయలసీమ జిల్లాల్లో మార్పులకు అవకాశం లేదని పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కూటమిలో అభ్యర్థులు మారుతున్న సమయంలో అవసరానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని సమాచారం. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని ఒక మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఉగాది తర్వాత ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థుల విషయంలో అవసరమైన మార్పులు ప్రకటిస్తారని తెలుస్తుంది. దీంతో వైసిపిలో ఎవరి సీట్లు మారుతాయనే ఉత్కంఠ కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications