జగన్ పార్టీ పార్లమెంటరీ నేత ఎన్నిక: భేటీకి బుట్టా రేణుక
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక శనివారం పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల ఆమె పతాక శీర్షికలకు ఎక్కిన విషయం తెలిసిందే. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు రేణుక కూడా చేరుతారనే ప్రచారం జరిగింది.
తాను టిడిపి అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానని చెప్పిన ఆమె ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శనివారం జగన్ నివాసానికి చేరుకొని ఆయనను కలిశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటరీ పార్టీ, శాసనసభా సమావేశం కానుంది. సమావేశం కోసం ఆమె వచ్చారు. సమావేశానికి ఆమె రాక ప్రాధాన్యతను సంతరించుకుంది.

మధ్యాహ్నం లోటస్ పాండులో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్షం సమావేశమైంది. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల పైన చర్చ జరిగింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా వారిగా సమీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్లమంటరీ నేతను ఎన్నుకోనున్నారు.












Click it and Unblock the Notifications