జగన్ ఆపరేషన్ నెల్లూరు - టార్గెట్ రెబల్స్, కీలక నిర్ణయాలు..!!

ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ జిల్లాల బస్సు యాత్ర పూర్తయింది. నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీకి కంచుకోట అయిన నెల్లూరు జిల్లాలో తాజా లెక్కలు మారుతున్నాయి. పార్టీ నుంచి టీడీపీలో చేరిన నేతల పై జగన్ గురి పెట్టారు. జిల్లాలో 2019 రిజల్ట్ రిపీట్ కావాలని స్పష్టం చేసారు. నియోజకవర్గాల వారీగా ప్రచారం, ప్రజా స్పందన పైన సర్వే నివేదికలను వివరించారు. మూడు నియోజకవర్గాల్లో అమలు చేయాల్సిన రోడ్ మ్యాప్ ను నిర్దేశించారు.

జగన్ మంత్రాంగం
ఏపీ ఎన్నికల సమరంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి. అక్కడ కొంత కాలంగా మారుతున్నసమీకరణాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. వైసీపీ నుంచి రెబల్స్ గా మారి టీడీపీ నుంచి పోటీ లో నిలిచిన నేతల పైన వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. జగన్ బస్సు యాత్ర రాయలసీమ జిల్లాల్లో పూర్తయి నెల్లూరు కు చేరింది.

YS Jagan moving with new strategies in Nellore latest road map for the party cadre

అక్కడ జిల్లాలో ప్రస్తుత రాజకీయాల పైన జగన్ జిల్లాకు చెందిన కీలక నేతలతో వరుస సమావేశాలు జరిపారు. నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికలతో చర్చించారు. తీసుకోవాల్సిన చర్యలను స్పస్టం చేసారు. పార్టీ అభ్యర్థులు ప్రచారంలో తీసుకోవాల్సిన చర్యలు .. బలాలు,బలహీనతలను వివరించారు.

పార్టీకి మార్గనిర్దేశం
జిల్లాలో ప్రతిపక్షాల లెక్కలు..పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన రోడ్ మ్యాప్ డిసైడ్ చేసారు. పార్టీలో చేరికల పైన చర్చించారు. ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన సాయిరెడ్డి నియోజవర్గాల వారీగా వస్తున్న స్పందన వివరించారు. ప్రత్యేకించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

నెల్లూరు సిటీలో మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించటంతో సిటీతో పాటుగా రూరల్ లో మారుతున్న లెక్కల పైన చర్చ చేసారు. అదే సమయంలో వెంకటగిరి గురించి కీలక మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. ఎంపీ గా టీడీపీ నుంచి వేమిరెడ్డి పోటీలో నిలవటంతో వైసీపీ ఆవిర్భావం నుంచి గెలుస్తూ వచ్చిన నెల్లూరు ఎంపీ సీటు గెలవాల్సిందేనని జగన్ స్పష్టం చేసారు.

రోడ్ మ్యాప్ ఖరారు
నెల్లూరులో నేడు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. సాయంత్రం కావలిలో జరిగే బహిరంగ సభలో జగన్‌ ప్రసంగిస్తారు. కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా సాగుతుంది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత కావలి బహిరంగసభలో పాల్గొంటారు జగన్‌. సభ ముగిశాక... ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం వరకు బస్సు యాత్ర సాగుతుంది.

రాత్రికి జువ్విగుంట క్రాస్ దగ్గర జగన్‌. కోవూరు సభలో జగన్ నెల్లూరు రాజకీయాల పైన స్పందించే అవకాశం కనిపిస్తోంది. పార్టీకి బలమైన జిల్లా అయిన నెల్లూరులో ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని జగన్ డిసైడ్ అయ్యారు. దీంతో, నెల్లూరు ఎన్నికల లెక్కలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+