పిఠాపురంలో జగన్ - పవన్ పై కొత్క స్కెచ్, కలిసొచ్చేనా..!!
ఏపీ ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరింది. ముఖ్య నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర 18వ రోజు తూర్పు గోదావరిలో కొనసాగుతోంది. పవన్ ఈ నెల 23న పిఠాపురం లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు చంద్రబాబు కుప్పంలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అధికారంలోకి రావటానికి కీలకమన గోదావరి జిల్లాల్లో జగన్ ఈ రోజు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో రోడ్ షో లో పాల్గొంటున్నారు.
జగన్ బస్సు యాత్ర
ముఖ్యమంత్రి జగన్ ఎస్ టీ రాజపురం రాత్రి బస నుంచి బయలుదేరారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్ , కత్తిపూడి బైపాస్ , తుని బైపాస్ , పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం లో జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే పిఠాపురం పైన జగన్ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేసారు.

పిఠాపురం పై ఫోకస్
పిఠాపురంలో వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. పార్టీ ముఖ్యులు గీతకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పిఠాపురంలో గెలుపు ఖాయమని పవన్ భావిస్తుంటే..తామ అమలు చేసిన సంక్షేమం - సామాజిక సమీకరణాలు తమకు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. రేపు పిఠాపురంలో పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పవన్ పైన జగన్ కొత్త స్కెచ్ సిద్దం చేసారు. ఈ రోజు రాత్రి తాను బస చేసిన ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అభ్యర్దులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నేతల మధ్య సమన్వయం పైన కీలక సూచనలు చేయనున్నారు. ఈ నెల 25 తరువాత జగన్ ప్రతీ రోజు మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్దం అవుతోంది.

గోదావరి లో కొత్త స్కెచ్
జగన్ బస్సు యాత్రకు గోదావరి జిల్లాలో మద్దతు లభించింది. తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదుగా కొనసాగింది. రావుల పాలెం సెంటర్ లో భారీగా జన స్పందన కనిపించింది. రాజమండ్రి నగరంలోనూ జగన్ యాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రోజు కాకినాడ రూరల్ పరిధిలో జగన్ సభలో పాల్గొంటున్నారు. భీమవరం సభలో జగన్ తన హాయంలో చేసిన కార్యక్రమాలు, సంక్షేమం గురించి వివరించారు. పవన్ పైన విమర్శలు చేసారు. కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన అభ్యర్ది పోటీలో ఉన్నారు. పవన్ పిఠాపురం సైతం కాకినాడ పరిధిలోనే ఉంది. దీంతో, కాకినాడ పరిధిలో జగన్ యాత్రకు వచ్చే స్పందన, ప్రసంగం పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications