పవన్ జీవిత కాలంలో, డబుల్ యాక్షనా - జగన్ సంచలన కామెంట్స్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు ప్రతిపక్ష హోదా రాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పైన సీరియస్ అయ్యారు. పవన్ లక్ష్యంగా కామెంట్స్ చేసారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు కాకుండా..ఎవరికి ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు సమయంలో నూ తామే ప్రతిపక్ష హోదా ఇచ్చామని చెప్పారు. తాజా బడ్జెట్ లో పథకాలకు కేటాయించిన నిధు ల పైన జగన్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు. అన్ని వర్గాలను మోసం చేసారని మండిపడ్డారు. వైసీపీ మద్దతు దారులు ఏం చేయవద్దంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జగన్ తప్పు బట్టారు.
పవన్ పై కామెంట్స్
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉప ముఖ్యమంత్రి పవన్ పైన గురి పెట్టారు. ఈ అయిదేళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పైన జగన్ స్పందించారు. పవన్ కార్పోరేటర్ కు ఎక్కువ - ఎమ్మెల్యేకు తక్కువ అని వ్యాఖ్యానించారు. జీవిత కాలంలో ఇప్పుడు ఒక సారి ఎమ్మెల్యే అయ్యారని జగన్ పేర్కొన్నారు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైనా జగన్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే వారిని చరిత్రలో తొలి సారి చూసామని వ్యాఖ్యానించారు. అయినా, శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారన్నారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ తమదే అయినప్పుడు.. తమకు కాకుండా ఎవరికి ఆ హోదా ఇస్తారని ప్రశ్నించారు.

ఎవరికి ఇస్తారు
మిగిలిన మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు.. ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందో చెప్పాలన్నారు. అసలు ఎక్కడా ప్రతిపక్ష హోదాకు సంఖ్యతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. 23 స్థానాలు గెలిచిన టీడీపీకి తాము ప్రతిపక్ష హోదా ఇచ్చామని గుర్తు చేసారు.
అధికారంలో మీరే.. ప్రతిపక్ష పాత్ర మీరేనా.. డబుల్ యాక్షన్ చేస్తారా అంటూ నిలదీసారు. బడ్జెట్ లో అంతా పరనింద ఆత్మస్తుతి కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమ య్యాయని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం పేరుతో అబద్దాలు చెప్పారన్నారు. మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల హామీ ఏమైందని ప్రశ్నించారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామనిని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై
చంద్రబాబు హయాంలో పరిశ్రమలు పెట్టే వారిని భయపెడుతున్నారని.. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళకు ఏడాదికి 18 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోటి 80 లక్షల మంది మహిళలకు ఈ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదని.. ఒక్కో మహిళకు చంద్రబాబు 36 వేలు బకాయి పడ్డారన్నారు. బడ్జెట్‌లో కూడా తల్లికి వందనం పథకానికి గ్రాంట్స్‌లో రూ.8278 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ పథకానికి రూ.13,112 వేల కోట్లు అవసరమన్నారు. ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు రూ.30 వేలు ఎగనామం పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పీఎం కిసాన్ కాకుండా రైతులకు 20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. రాష్ట్రంలోని 53,58,266 మంది రైతులకు రూ.10,717 కోట్లు కేటాయించాలని చెప్పారు. వైసీపీ వాళ్ళకు ఏ పథకాలు ఇవ్వొద్దని చంద్రబాబు ప్రకటించటం ఏంటని నిలదీసారు.












Click it and Unblock the Notifications