Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షర్మిలతో కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్- నిప్పులు చెరిగిన జగన్-చంద్రబాబు అరెస్టు అందుకే..!

ఏపీలో పీసీసీ ఛీఫ్ గా సోదరి వైఎస్ షర్మిల నియామకం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలపై సీఎం వైఎస్ జగన్ ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతిలో జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ కాన్ క్లేవ్ లో పాల్గొన్న జ గన్.. కాంగ్రెస్ రాజకీయాలు, చంద్రబాబు అరెస్ట్, కేంద్రంతో సంబంధాలు వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాల్ని ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ తో పంచుకున్నారు..

Recommended Video

    Congress, Sharmila, Chandrababu అందరూ ఒకటే.. Ys Jagan Shocking Comments | Telugu Oneindia

    చంద్రబాబు అరెస్టుపై రాజ్ దీప్ అడిగిన ప్రశ్నపై స్పందించిన జగన్.. ఎన్నికల సమయంలో ఏ సీఎం ఒక పేరున్న వ్యక్తిని అరెస్టు చేయాలని అనుకోడన్నారు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలు యాక్షన్ తీసుకున్నప్పటికీ కోర్టులు నిర్థారిస్తాయన్నారు.ఏపీలో రెండు జాతీయ పార్టీలకు అంత సీన్ లేదని జగన్ తేల్చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీలను ఎందుకు డ్రాప్ చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రతి పార్టీ తన సొంత సర్వేలను నిర్వహిస్తుందని, సర్వేలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుందన్నారు.

    ys jagan slams congress party for divide and rule politics with his sister ys sharmila

    ప్రజలు ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారని, అయితే స్థానిక ఎమ్మెల్యేల రిపోర్ట్ సరిగ్గాలేదని, అందుకే ఇలా ముందుగా జాగ్రత్తపడుతున్నామని జగన్ చెప్పుకొచ్చారు. కేంద్రానికి మద్దతుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాము కేంద్ర ప్రభుత్వంతో స్నేహబంధం కొనసాగిస్తాం అదే సమయంలో ఇష్యూ బేస్డ్ పై మద్దతు ఇస్తున్నామన్నారు. అలాగే మీ సోదరి వైయస్ షర్మిలాను పీసీసీ చేశారు.. దీన్నెలా చూస్తున్నారన్న ప్రశ్నకు.. కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ ఆడుతోందని తెలిపారు.

    ys jagan slams congress party for divide and rule politics with his sister ys sharmila

    ఇది కాంగ్రెస్‌కు అలవాటైన పనేనని, రాష్ట్రాన్ని విడగొట్టిందని, విభజించి పాలించు అనేది రాష్ట్రంలో చేసిందన్నారు. తమ కుటుంబంలో కూడా దీన్నే ఇంప్లిమెంట్ చేస్తోందన్నారు. తన చిన్నాన్నను గతంలో తనపై ఉసిగొల్పిందని, కాంగ్రెస్ పార్టీ సమాధి అయ్యిందని, వాళ్లు ఇంకా పాఠాలు నేర్వలేదన్నారు. వైయస్సార్ లేకుండా 2004 2009లో కాంగ్రెస్ లేదని, ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలపై కోపంగా లేదా అని అడిగిన ప్రశ్నకు.. తనకు బాధ ఉందని, అయితే దేవుడిపై భారం వేశానని జగన్ తెలిపారు. తాను దేవుడిని నమ్ముతానని, అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు.

    ys jagan slams congress party for divide and rule politics with his sister ys sharmila

    పదిహేను పదహారు సంవత్సరాల క్రితం తాను జగన్ రెడ్డిని కలిసినప్పుడు, ఇప్పటికీ జగన్ రెడ్డికి మధ్య మార్పు ఏంటని రాజ్ దీప్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. మీరే బెటర్ జడ్జ్ అన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, మీకు అదే తృప్తి ఇస్తుందా అని అడిగిన ప్రశ్నకు.. తన పాదయాత్రలో ఎంతో మందిని కలిశానని, వారి సమస్యలను తీర్చడంలో తనకు తృప్తినిస్తోందన్నారు.

    ys jagan slams congress party for divide and rule politics with his sister ys sharmila

    మీ రికార్డు చూసే ఓటేయమని అడుగుతున్నారు.. ఏంటదని ప్రశ్నిస్తే.. తన పరిపాలన బాగుందని మీరు భావిస్తేనే తనకు ఓటెయ్యండని ప్రతి పబ్లిక్ మీటింగ్‌లో అడుగుతున్నట్లు జగన్ తెలిపారు. నీ కాన్ఫిడెన్స్‌కు హ్యాట్సాఫ్ సీఎం గారు...అంత బోల్డ్ స్టేట్‌మెంట్ ఎవరూ ఇప్పటి వరకు ఇవ్వలేదని రాజ్ దీప్ దీనికి సమాధానంగా వ్యాఖ్యానించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+