గుంటూరు జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్

YS Jagan: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు నందిగం సురేష్‌ను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం 11 గంట‌ల‌కు గుంటూరు సబ్ జైలుకు వెళ్లనున్నారు. నందిగం సురేష్‌ను కలుసుకోనున్నారు.

మూడు సంవత్సరాల కిందట అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. నందిగం సురేష్ సహా కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అప్పట్లో వారిపై కేసులు నమోదయ్యాయి.

YS Jagan to meet former MP Nandigam Suresh in Guntur Sub Jail

ముందస్తు బెయిల్ కోసం వాళ్లు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఇటీవలే ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాష్ సహా ఇతర నాయకుల పిటిషన్లను తిరస్కరించింది.

ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించిన వెంటనే నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన సెల్‌ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి మరోచోటికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ పక్కా సమాచారం అందడంతో హైదరాబాద్‌ వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. గుంటూరు జైలుకు తరలించారు.

దీన్ని బూటకపు కేసుగా విమర్శిస్తోంది వైఎస్ఆర్సీపీ. మూడేళ్ల కిందట ఈ ఘటన జరిగినా ఉద్దేశపూరకంగా కొంతమందిని సాక్షులుగా సృష్టించారని, వారివద్ద తప్పుడు స్టేట్‌మెంట్లు తీసుకుని నందిగం సురేష్‌తో పాటు, మరికొందరు తమ పార్టీ నాయకులపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఆరోపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+