సభ లో చంద్రబాబు, పవన్ ను చూడగానే జగన్ ఇలా - సీటు ఖరారు..!!

ఏపీ శాసనసభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సభ కొలువు తీరింది. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తరువాత డిప్యూటీ సీఎం పవన్ ప్రమాణం చేసారు. ఆ తరువాత మంత్రులకు అవకాశం దక్కింది. వారి తరువాత జగన్ కు అవకాశం ఇచ్చారు. జగన్ తన ప్రమాణం చేసి వెంటనే బయటకు వెళ్లిపోయారు. సభలోకి వచ్చిన సమయంలో ఎదురుగా ఉన్న సీఎం చంద్రబాబును చూసి జగన్ స్పందించారు.

ఏపీ అసెంబ్లీలో
ఏపీ శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి అయిన తరువాతనే సభలోకి వస్తానని నాడు చంద్రబాబు శపథం చేసారు. తిరిగి ఈ రోజున సీఎంగానే సభలో అడుగు పెట్టారు. ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ తొలి సారి ఎమ్మెల్యేగా సభలో ప్రవేశించారు. ముఖ్యమంత్రి తరువాత పవన్ ప్రమాణం చేసారు. ఇక..మంత్రుల పేర్ల ఆధారంగా వరుసగా ప్రమాణం చేసేందుకు ఆహ్వానించారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ సభలోకి ప్రవేశించారు. మంత్రుల తరువాత జగన్ కు అవకాశం దక్కింది.

YS Jagan took oath in Assembly as MLA key directions for party MLA s

చంద్రబాబు - జగన్ పరస్పరం
ప్రమాణం చేసేందుకు వస్తున్న సమయంలో అందరికీ దండం పెడుతూ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుకు కూడా జగన్ నమస్కరించడంతో ఆయన ప్రతి నమస్కారం చేశారు. ప్రమాణం చేసే సమయంలో తొలుత వైఎస్ జగన్మోహన్ అనే నేను అని పలికి ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని సవరించుకున్నారు. అసెంబ్లీలో ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా ఎమ్మెల్యే జగన్ వెళ్లిపోయారు. అసెంబ్లీ లోపలకి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయం ఉండటంతో చివరి బెంచ్‌లో కూర్చున్నారు.

వెనుక సీటులో జగన్
పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్‌లోకి వెళ్లి కొద్దిసేపు వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తరువాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. సభలో జగన్ పక్కనే పెద్దిరెడ్డి మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక..రేపు (శుక్రవారం) స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక జరగనుంది. కొత్త స్పీకర్ గా అయ్యన్న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి జగన్ హాజరవుతారా..పార్టీ ఎమ్మెల్యేలకే అప్పగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+