పర్యటన రద్దు చేసుకున్న జగన్

YS Jagan: చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ హత్యకు గురైన అస్ఫియా అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

జగన్ రానున్నారనే విషయం తెలిసిన వెంటనే హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన పుంగనూరుకు వెళ్లిన విషయం తెలిసిందే. అస్ఫియా అంజుమ్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. దీని తరువాత పోలీసులు వేగంగా స్పందించారు. దోషులను అరెస్ట్ చేశారు.

YS Jagan s Punganur visit on 9th October has been cancelled

ప్రభుత్వం స్పందించిన నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. జగన్ పుంగనూరు పర్యటన వల్ల అక్కడ జరిగిన ఏడేళ్ల బాలిక అస్ఫియా దారుణ హత్య రాష్ట్రం మొత్తం తెలిస్తుందని, దాని వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో మంత్రులు పుంగనూరుకు వచ్చారని విమర్శించారు.

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్య జరిగిన సమయంలోనే ఇంత శ్రద్ధ తీసుకుని ఉంటే పుంగనూరు ఉదంతం పునరావృతం అయ్యేది కాదని, ఇలాంటి ఘాతుకాలకు ఒడిగట్టడానికి భయపడేవాళ్లని పెద్దిరెడ్డి అన్నారు. ముచ్చుమర్రి బాలిక విషయంలో ప్రభుత్వం గానీ, హోం మంత్రి అనిత గానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని విమర్శించారు. ఇప్పటివరకు కూడా దోషులను పట్టుకోలేదని మండిపడ్డారు.

జగన్ వస్తాడని తెలియడం వల్లే మంత్రులు పుంగనూరుకు వచ్చి హడావిడి చేశారని పెద్దిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక దాడులు, హత్యలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా ప్రజల సంక్షేమం కోసం పరిపాలన సాగించాలంటూ ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+