ప్రభాస్ ఎవడో తెలియదన్న షర్మిల-అదానీకి జగన్ బ్లాంక్ చెక్-వదలొద్దు చంద్రబాబూ..!
ఏపీ రాజకీయాల్లో గతేడాది ఎంట్రీ తర్వాత పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ప్రత్యర్థులపై మాటల దాడి తీవ్రం చేస్తున్నారు. ముఖ్యంగా అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న విమర్శలు రోజురోజుకూ పదునెక్కుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా అన్న జగన్ ప్రెస్ మీట్లో ప్రదర్శించిన తన వీడియోపై ఆమె విమర్శలు గుప్పించారు. మీ రాజకీయాలకు ఏదైనా వాడేసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అదానీ నుంచి ముడుపుల స్వీకరణపై టార్గెట్ చేశారు.
జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్ లా అదానీ కి రాసి ఇచ్చారంటూ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ను "అదానీ ప్రదేశ్ "గా మార్చారన్నారు. 1750 కోట్ల లంచాలకు ఆంధ్ర ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారన్నారు. జగన్ అవినీతి ప్రపంచానికి తాకింది. ఇది YSR కుటుబానికి, రాష్ట్రానికి అవమానం అన్నారు. అదానీ తో జగన్ చేసుకున్న ఒప్పందాలు అన్నింటిపై విచారణ చేయాలని సీఎం చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు. ఏపీలో అదానీ గ్రూప్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు.

అగ్రరాజ్యం బయట పెట్టే దాక అదానీ, జగన్ లంచాల గురించి తెలియలేదని, ఇక్కడ ఉన్న ప్రభుత్వ శాఖలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. అంతర్ జాతీయ స్థాయిలో మన దేశ అవినీతి గురించి ఇప్పుడు చర్చ జరుగుతుందన్నారు. ఇది మన దేశానికి అవమానం అన్నారు. అదానీ దేశ పరువు తీస్తే, జగన్ ఆంధ్ర రాష్ట్రం పరువు తీశాడన్నారు. ఒక్క డీల్ లో 1750 కోట్లు లంచమా అని అడిగారు. మీకు లంచాలు, ఇక్కడ డిస్కం లకు నష్టాలు అన్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదానీతో ఒప్పందాలు పునస్సమీక్షించాలని కోరారు.
మరోవైపు అన్న జగన్ తాజాగా ప్లే చేసిన తన వీడియోపై షర్మిల స్పందిస్తూ.. జగన్ కి నిజంగా చెల్లెలి మీద ప్రేమ ఉండి ఉంటే
బాలకృష్ణ లేదా ఆయన బిలింగ్ నుంచి తప్పుడు ప్రచారం జరిగింది అని తెలిసి ఉంటే....మీరు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. ఎందుకు బాలకృష్ణ మీద విచారణ జరిపించలేదన్నారు. చెల్లెలి మీద ప్రేమ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. తనకు అక్రమ సంబంధాలు అంట కట్టిన వాళ్ళు ఎవరో కూడా తనకు ఇప్పటికీ తెలియదన్నారు. ప్రభాస్ ఎవడో తెలియదంటూ మరోసారి షర్మిల వ్యాఖ్యానించారు. ఈ విషయం తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు.












Click it and Unblock the Notifications