తల్లికి వందనం అర్హులైన విద్యార్థులు 80 లక్షలకు పైమాటే..!!

YS Sharmila: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. వార్షికోత్సవ వేడుకలను జరుపుకొంటోంది.

గత ఏడాది జూన్ 12వ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇతర మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. తొలి వార్షికోత్సవాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.

YS Sharmila criticize on Andhra Govt led by CM Chandrababu

టీడీపీ కూటమి ఏడాది పాలనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ అని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత చేపట్టి ఏడాది పూర్తయిందని, ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారని, సూపర్ సిక్స్ అంటూ ఊదర గొట్టారని షర్మిల గుర్తు చేశారు. అధికారం ఇస్తే అన్నీ చేస్తానని నమ్మించి, ఆ తర్వాత విస్మరించిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అంతా మోసం అని మండిపడ్డారు.

సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా ? అని ప్రశ్నించారు షర్మిల. ఏడాది గడిచినా సూపర్ సిక్స్ హామీలు గుర్తుకు రాలేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు లేకుంటే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని షర్మిల పేర్కొన్నారు.

ఈ ఏడాదిలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.. ఒకరికైనా నిరుద్యోగ భృతి కల్పించలేదని షర్మిల విమర్శించారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని, 55 లక్షల మంది రైతులను మోసం చేశారని అన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని, రాష్ట్రంలో 80 లక్షలకు పైగా అర్హులైన విద్యార్థులు ఉంటే ఇప్పుడు 60 లక్షల మంది విద్యార్థులకు ఇస్తాం అంటున్నారని చెప్పారు.

ప్రతి మహిళలకు మహిళా శక్తి కింద నెలకు 1,500 రూపాయలతో ఏడాదికి 18,000 మొత్తాన్ని ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, మహిళలను ఒక శక్తిగా చేస్తామని చెప్పి మోసం చేశారని షర్మిల ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి చంద్రబాబుకు మనసు రాలేదా అని నిలదీశారు.

కరెంట్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రెండు సార్లు పెంచారని, దీనివల్ల ప్రజలపై 17,000 కోట్ల రూపాయల భారం వేశారని విమర్శించారు. మొత్తంగా చంద్రబాబు గారి ఏడాది పాలన అంతా త్రీD గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+