సోనియాతో షర్మిల, ఒప్పందం ఫిక్స్ - ఏపీకి ఓకే, జగన్ ఓట్ బ్యాంక్ పై గురి..!!
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఇక కాంగ్రెస్ నేతగా మారబోతున్నారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏపీలో బాధ్యతల విషయంలో ససేమిరా అన్న షర్మిల ఇప్పుడు సరే అంటున్నారు. పాలేరు నుంచి పోటీకి రూట్ క్లియర్ అయింది. తెలంగాణ కంటే ఏపీలోనే షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైంది. సోనియా సమక్షంలో షర్మిల తన పార్టీని అధికారికంగా కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు.
కండీషన్లకు ఆమోదం:అనేక తర్జన భర్జనల తరువాత షర్మిల కాంగ్రెస్ కండీషన్లకు షర్మిల ఓకే చెప్పారు. తన పార్టీ విలీనానికి ఓకే చెప్పారు. వారం రోజులుగా బెంగళూరు కేంద్రంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ వీలనం ఒప్పందాలు ఖరారయ్యాయి. షర్మిల కోరిన విధంగా పాలేరు నుంచి పోటీకి అంగీకారం కుదిరింది. సోనియా సమక్షంలో ఈ నెల 12న అధికారికంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. గత నెల 18న ప్రతిపక్ష పార్టీల సమావేశం సమయంలోనే షర్మిల బెంగళూరులో సోనియాతో సమావేశం కావాల్సి ఉంది. అయితే, పార్టీ విలీనం.. ఏపీలో బాధ్యతల పైన తేల్చుకోకపోవటంతో సమావేశం వాయిదా పడింది.

తెలంగాణ నుంచి పోటీ:షర్మిల పొత్తు కాదు, తన పార్టీని వీలనం చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం షరతు విధించింది. దీని పైన షర్మిల చాలా రోజులగా చర్చలు చేసారు. చివరకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ విలీనం తోనే మేలు జరుగుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇదే అంశంలో షర్మిలను డీకే శివకుమార్ ఒప్పించారు.
షర్మిల ఎంట్రీ పైన తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు ముఖ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అభ్యంతరం లేదని, ఏపీలో షర్మిల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కానీ, షర్మిల ముందుగా అందుకు సమ్మతించ లేదు. ఆ తరువాత పోటీ పాలేరు నుంచి ఏపీలో పార్టీ తరపున ప్రచారానికి సిద్దమని స్పష్టం చేసారు. ఫలితంగా సోనియా సమక్షంలో పార్టీని విలీనం చేయనున్నారు.

ఏపీలో కొత్త బాధ్యతల్లో:ఏపీ వ్యవహారంలో కాంగ్రెస్..షర్మిల మద్య రాజీ ఫార్ములా కుదిరింది. షర్మిల ఏపీ నుంచి పోటీ చేయాలని తొలుత పట్టు బట్టిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు పాలేరు నుంచి షర్మిల పోటీకి అంగీకారం తెలిపింది. ఫలితంగా షర్మిల కాంగ్రెస్ తరపున ఏపీలో ఎన్నికల ప్రచారానికి అంగీకరించారు. ఏపీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం జగన్ కు మళ్లటంతో వైఎస్ కుమార్తెగా, జగన్ సోదరిగా కాంగ్రెస్ నుంచి ప్రచారం చేయటం ద్వారా వైసీపీని దెబ్బ తీసి..భవిష్యత్ రాజకీయానికి అడుగులు వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో షర్మిల ప్రచారానికి ముందుకు రావటంతో, అధికారికంగా ఈ నెల 12న ఢిల్లీలో విలీన ప్రక్రియ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పాత్ర ఏంటనేది షర్మిల అధికారికంగా వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications