YS Sharmila: సుప్రీంకోర్టు స్టే పై షర్మిల రియాక్షన్ ఇదే..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాజకీయ నేతలంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓ పరిణామం మాత్రం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దానిపై ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు స్పందించింది. దీంతో తిరిగి ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇందుకు కారణమైన పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ స్పందించారు.
రాష్ట్రంలో తొలిసారి కడప లోక్ సభ సీటులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేంద్రంగానే ఎక్కువగా ప్రచారం సాగించారు. దీంతో వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించి ఆమె ఈ కేసుపై మాట్లాడకుండా ఉత్తర్వులు పొందారు. అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లినా వైఎస్ షర్మిలకు కానీ, ఇదే కేసులో ఉన్న వివేకా కుమార్తె సునీతకు కానీ ఊరట దక్కలేదు. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ లోపు ఎన్నికలు ముగిసిపోయాయి.

ఎన్నికలు ముగిశాక సుప్రీంకోర్టు కడప కోర్టు ఉత్తర్వులపై విచారణ జరిపింది. వివేకా కేసులో షర్మిల, సునీతతో పాటు ఇంకెవరూ మాట్లాడకుండా కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ మేరకు నిన్న తీర్పు వెలువరించింది. కానీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో షర్మిల సహా మిగతా వాళ్లూ వివేకా కేసుపై మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో సహజంగానే సుప్రీంకోర్టు ఆలస్యంగా ఇచ్చిన తీర్పు ప్రభావం కూడా లేకుండా పోయింది.
దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా, వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయ్యింది. అధికార బలాన్ని… pic.twitter.com/gF2vwVk28Z
— YS Sharmila (@realyssharmila) May 18, 2024
దీంతో షర్మిల కూడా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ఇవాళ స్పందించారు. దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా, వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు. భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయ్యిందన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెటు అంటూ ట్వీట్ చేశారు.
అలాగే ఈ విజయం తొలి అడుగు మాత్రమేనని, రాబోయే రోజుల్లో, వివేకకానంద రెడ్డి గారి కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తామని షర్మిల తెలిపారు. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తామని సవాల్ చేశారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications