మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

APCC చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ కు ప్రజా సమస్యలు కాదు.. జగన్ కి ప్రజా సమస్యలు కాదు..కావలసినవి బలప్రదర్శనలు అని తీవ్ర విమర్శలు చేశారు. అందుకే పర్యటనల పేరుతో బలప్రదర్శనలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ చేసిన బల ప్రదర్శనలకు 3 ముగ్గురు బలి అయ్యారని.. ఆయన ప్రదర్శనలకు నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

అటు ప్రధాని మోదీ పైనా వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. యోగా చేసి మోదీ తృప్తి పడితే సరిపోతుందా ? అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తృప్తి పడేలా ఒక్క ప్రకటన అయినా చేశారా? అని నిలదీశారు. విభజన హామీలపై మోసం చేసి, మీరు తృప్తి పడతారా ? అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

"వివేకా ను చంపి సునీత మీద నెట్టేసినోళ్ళకు. సింగయ్యను తొక్కి చంపి AI గ్రాఫిక్స్ అనడం ఒక లెక్కనా ?వివేకా హత్య విషయంలో CBI అన్ని ఆధారాలు చూపుతుంటే.. సునీత చంపింది అనేట్లోలకు..టైర్ల కింద తొక్కి గ్రాఫిక్స్ అనక ఏమంటారు ?" అంటూ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.

" రాష్ట్ర రాజకీయాలు దారుణంగా ఉన్నాయి. ఉన్న పార్టీలు అన్ని మోడీ తొత్తులే. అందరు మోదీ జపం చేస్తున్నారు. మోదీకి యోగా మీద ఉన్న ఆంధ్రా రాష్ట్ర ప్రజల మీద లేదు. ఆంధ్ర రాష్ట్రంలో యోగా చేస్తే తృప్తి గా ఉందంట. ఎవరు మిమ్మల్ని యోగా చేయమని చెప్పారు మోదీ గారు ? మీరు యోగా చేసి తృప్తిగా ఉంటే సరిపోతుందా ? యోగా చేసి తృప్తి పడి ఒక్క హామీ అయినా ఇచ్చారా ? తృప్తి పడి ఒక్క ప్రకటన అయినా చేశారా ? మీరు ఇచ్చిన హామీల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తృప్తిగా లేరు. ప్రత్యేక హోదా అని మోసం చేశారు. దిల్లీని మించిన రాజధాని కడతాం అన్నారు. ఇప్పుడు నిధులు కాదు అప్పులు ఇస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గించి మోసం చేశారు. రాష్ట్ర బిడ్డలకు ఉద్యోగాలు లేవు. బీజేపీ మోసాల మీద బాబు,పవన్,జగన్ కనీసం స్పందన లేదు. బీజేపీ కి ఊడిగం చేస్తున్నారు" అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"బాబు ,పవన్ కూటమి కట్టి మోసం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్ పెట్టుకున్నది అక్రమ పొత్తు. ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు జగన్ కి లేదు. 5 ఏళ్లు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించాడు. రైతులను నట్టేట ముంచారు. రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. YSR పనులు ప్రారంభించిన జలయజ్ఞం ముట్టుకోలేదు. 6 నెలల్లో మొత్తం ప్రాజెక్ట్ లు పూర్తి అని ఒక్క దాన్ని పూర్తి చేయలేదు. 5 ఏళ్లలో ప్రజల ఇబ్బందులు కనుక్కోలేదు. ప్రజల ముందుకు రాలేదు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేడు. ఇప్పుడు 2.0 అని మొహం చూపిస్తాడట. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడట" అని మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.

YS Sharmila s Explosive Remarks Target Former CM Jagan Mohan Reddy

"జగన్ కి ప్రజా సమస్యలు కాదు.. కావలసినవి బలప్రదర్శనలు. అందుకే పర్యటనల పేరుతో బలప్రదర్శనలు చేస్తున్నారు. ఈయన చేసిన బలప్రదర్శన లకు 3 ముగ్గురు బలి. ఈయన ప్రదర్శనలకు నిషేధం విధించాలి. హత్యలు చేసిన వాళ్లు, చంపిన వాళ్ళు ఒప్పుకుంటారా ? వివేకా బాబాయి నీ హత్య చేయించి సునీత మీదే దోశారు. ఇప్పుడు సింగయ్య ను చంపి AI అంటున్నారు. బాబాయిని చంపి సునీత మీద నెట్టివేసిన వాళ్ళకు సింగయ్య మృతి మీద అబద్ధాలు చెప్పడం ఒక లెక్కా ? వివేకా హత్య కేసులో CBI అన్ని ఆధారాలు చూపించింది. హత్య చేసిన వాళ్లు,చేయించిన వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు ఉన్నాయని చెప్పింది. అయినా మేము చంపలేదు.. మాకు తెలియలేదు అని మాట మార్చలేదా ? ఇది అంతే" అని కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+