వైసీపీ మీద కోపం వైఎస్సార్ మీద చూపొద్దు-చంద్రబాబును కోరిన షర్మిల..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాస్త కలుపుగోలుగా ఉంటున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు క్రమంగా దూకుడు పెంచుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇదే క్రమంలో ఓ కీలక అంశంపై సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆమెకు మంటపుట్టించింది. దీంతో ఆమె చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పోలుస్తూ ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో చంద్రబాబు జగన్ ను ఫాలో అవుతున్నట్లు ఉందన్నారు.
వైద్య,విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి అప్పట్లో జగన్ పెద్ద తప్పు చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో నడుస్తున్నారని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు,ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు తొలగించడాన్ని షర్మిల తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతీకార చర్యగా భావిస్తోందన్నారు.ఎన్టీఆర్ అయినా వైఎస్సార్ అయినా ఉమ్మడి ఏపీలో అభివృద్ధికి పాటుపడిన వాళ్లేనన్నారు. అలాగే పాలనలో తమదైన ముద్ర వేసినవాళ్లే అని షర్మిల తెలిపారు.

ఎన్టీఆర్, వైఎస్సార్ ను రాజకీయాలకు అతీతంగా చూడాలి తప్ప నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని షర్మిల చంద్రబాబుకు హితవు పలికారు. వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంటు, పెన్షన్లు ఇలా ప్రతీ పథకం దేశానికి ఆదర్శం అన్నారు. వైఎస్సార్ ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదన్నారు. తెలుగు వారి ఆస్తి అన్నారు. వారి గుండెల్లో ఆయన స్ధానం ఇప్పటికీ పదిలంగా ఉందన్నారు. వైసీపీ మీద ఉన్న కోపాన్ని వైఎస్సార్ మీద రుద్దడం సరికాదని కూటమి ప్రభుత్వానికి తెలిపారు. వైసీపీలో వైఎస్సార్ లేడని, అది ఎన్నటికైనా వైవీ, సజ్జల, సాయిరెడ్డి పార్టీనే అన్నారు.












Click it and Unblock the Notifications