కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోరాటాలే శరణ్యం: బాబు పర్యటనలతో లాభం లేదంటూ జగన్ ఫైర్

|
Google Oneindia TeluguNews

కడప: రైతుల సంక్షేమం విషయంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇక పోరాటాలే శరణ్యమని హెచ్చరించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గత మూడు రోజులుగా గాలి, వానలతో తీవ్రంగా దెబ్బతిన్న పండ్ల తోటలను సోమవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఉద్యానవన రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారికి ఎకరాకు రూ.50వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అకాలవర్షాలు, ఈదురుగాలులతో పెద్ద ఎత్తున పంటలు, పండ్లతోటలు నష్టపోయిన రైతాంగానికి ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా ఎకరాకు రూ.10వేలు మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నారన్నారు.

ఆ 10వేలు చివరకు సాగు ఖర్చులకు కూడా సరిపోవని, ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు చేస్తామని ఓట్లు దండుకున్న చంద్రబాబు.. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

సబ్సిడీ రుణాలు అందక, విత్తనాలు, ఎరువుల కొరత, అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నదాతలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. పంటల రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ తెప్పించడంలో, ఇన్సూరెన్స్ మంజూరు చేయడంలోనూ తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందన్నారు.

కేవలం రైతులను మభ్యపెట్టేందుకే బాబు పర్యటనలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోవడానికి, ముఖ్యంగా ఉద్యానవన పంట రైతులకోసం ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని, అవసరమనుకుంటే రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడుతానని ఆయన హెచ్చరించారు.

ఇక పంటల బీమా విషయంలో జిల్లాను యూనిట్‌గా తీసుకోకుండా గ్రామాల వారీగా యూనిట్‌గా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం హామీలు, ప్రసంగాలకే ముఖ్యమంత్రి పరిమితమై అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని, రైతులు ఇక బాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు.

రైతులతో జగన్

రైతులతో జగన్

రైతుల సంక్షేమం విషయంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

రైతులతో జగన్

రైతులతో జగన్

ఇక పోరాటాలే శరణ్యమని హెచ్చరించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గత మూడు రోజులుగా గాలి, వానలతో తీవ్రంగా దెబ్బతిన్న పండ్ల తోటలను సోమవారం ఆయన పరిశీలించారు.

నష్టపోయిన పంట

నష్టపోయిన పంట

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఉద్యానవన రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారికి ఎకరాకు రూ.50వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పంటను పరిశీలిస్తున్న జగన్

పంటను పరిశీలిస్తున్న జగన్

అకాలవర్షాలు, ఈదురుగాలులతో పెద్ద ఎత్తున పంటలు, పండ్లతోటలు నష్టపోయిన రైతాంగానికి ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా ఎకరాకు రూ.10వేలు మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నారన్నారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Monday visited Pulivendula and met farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X