జగన్ కు పవన్ వార్నింగ్ పై అంబటి సెటైర్లు చూశారా ?

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న పోలీసు అధికారుల్ని రేపు తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టబోమంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన హెచ్చరికలపై సుమోటో కేసులు నమోదు చేస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇవాళ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. జగన్ పై సుమోటో కేసులు పెడతామంటూ పవన్ ఇచ్చిన వార్నింగ్ పై స్పందించిన అంబటి.. కమాన్ పెట్టు అన్నారు.

పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారని పవన్ చెప్తున్నారని, అప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని అంబటి ప్రశ్నించారు. జగన్ పై ఐదేళ్ల తర్వాత చర్యలు తీసుకోవడానికి ఐదేళ్ల తర్వాత తాను ఎక్కడ ఉంటారో పవన్ కే తెలియదన్నారు. 40 శాతం ఓట్ షేర్ ఉన్న వ్యక్తిని పవన్ బెదిరిస్తున్నారన్నారు. మీది మంచి ప్రభుత్వం కాదు ముంచిన ప్రభుత్వం అన్నారు. అధికారులపై మీకు అంత ప్రేమ ఉంటే మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ను కొట్టిన మీ కాకినాడ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారుల్ని కొడితే మీ ప్రభుత్వంలో దిక్కులేదని, మీరు మిమ్మల్ని బెదిరిస్తారా అని అంబటి ప్రశ్నించారు.

ysrcp leader Ambati Rambabu satires on pawan kalyan over warning to ys jagan

చంద్రబాబు, పవన్, హోంమంత్రి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెడితే బాధపడుతున్న వారు.. గతంలో ఆరోగ్యమంత్రిగా పనిచేసిన విడదల రజనీపై ఎలాంటి పోస్టులు పెట్టారో చూడాలన్నారు. వారి మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.
గతంలో మీడియా సమావేశంలో చెప్పులు తీసి ఏమన్నారో పవన్ యూట్యూబ్ లో వీడియో చూసుకోవాలన్నారు. అప్పుడు మీమీద సుమోటో కేసు పెట్టాలన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెట్టిన ఏ పోలీసు అధికారినీ వదిలిపెట్టమన్నారు.
సప్తసముద్రాల అవతల ఉన్నా తెచ్చి శిక్షిస్తామని పవన్ తో పాటు ఐపీఎస్ అధికారుల్నీ హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. పవన్ కు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివేసి వెళ్లిపోతారని, మళ్లీ వారం రోజుల పాటు తిరిగి రారన్నారు. పవన్ ఈసారి సొంత బుర్ర వాడాలని అంబటి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+