వైసీపీ యువనేత నాగార్జున యాదవ్‌కు కీలక పదవి..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాల్లో ఒకటి.. నాడు- నేడు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి, వాటి రూపురేఖలను మార్చడానికి వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం.
నాడు నేడు కింద ఇప్పటివరకు 16 వేలకు పైగా పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దింది ప్రభుత్వం. డిజిటల్ క్లాసులను నిర్వహిస్తోంది. దీనితో పాటు అమ్మఒడి కింద తమ పిల్లలను ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పేద కుటుంబాలకు చెందిన తల్లులకు ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. 15,000 రూపాయలను తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తోంది.

ఈ పథకం వల్ల పాఠశాలల్లో డ్రాపౌట్స్ భారీగా తగ్గాయి. అదే స్థాయిలో అడ్మిషన్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోన్నాయి. సీట్లు ఖాళీ లేవంటూ బ్యానర్లు వెలిసే పరిస్థితి ఏర్పడిందంటే- ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఏ స్థాయిలో చోటు చేసుకుంటోన్నాయనేది అర్థం చేసుకోవచ్చు.
అలాంటి ప్రతిష్ఠాత్మక పథకం అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యలో కార్యకలాపాలను కొనసాగిస్తోందీ సంస్థ.
ఈ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా వైఎస్ఆర్సీపీ యువనేత యనమల సాయి నాగార్జున యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలను స్వీకరించిన తేదీ నుంచి రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ పదవీ కాలం ఇవ్వాళ్టితో ముగిసింది. దీనితో నాగార్జున యాదవ్‌ను ఈ స్థానంలో నియమించింది.












Click it and Unblock the Notifications