Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షర్మిల భుజం మీద చంద్రబాబు గన్

దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును కేంద్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. 12 గంటల పాటు అంటే అర్ధరాత్రి 12 వరకూ దీనిపై చర్చ సాగింది. అనంతరం ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేశారు. 232 మంది దీన్ని వ్యతిరేకించారు.

టీడీపీ మద్దతు ఇవ్వడం..

వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమౌతోంది. ముస్లిం సామాజిక వర్గానికి చంద్రబాబు చేసిన మోసం చరిత్రలో నిలిచిపోతుందంటూ వైఎస్ఆర్సీపీ ఘాటుగా విమర్శిస్తోంది. ముస్లిం మైనారిటీ విషయంలో చంద్రబాబుకు ఉన్న వ్యతిరేక వైఖరి ఈ బిల్లు విషయంలో మరోసారి బయపడిందంటూ మండిపడుతోంది.

YSRCP leader Sailajanath criticize Chandrababu and YS Sharmila

చంద్రబాబు తీరని ద్రోహం..

ఈ విషయంపై తాజాగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శైలజానాథ్ స్పందించారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనారిటీలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. వక్ఫ్ బిల్లు అంశాన్ని పక్కదోవ పట్టించడానికే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను తెర మీదికి తెచ్చారని, ఆమెతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.

డైవర్ట్ చేయడానికి..

ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరొక అంశాన్ని పైకి తేవడం చంద్రబాబుకు అలవాటని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, డైవర్షన్‌ చేయడానికి షర్మిలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు చేస్తోన్న రాజకీయాల్లో ఆమె ఓ భాగం అయ్యారని శైలజానాథ్‌ అన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా..

ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, వారికిచ్చిన మాట తప్పుతూ వక్ఫ్‌ బిల్లు విషయంలో మైనారిలకు చంద్రబాబు ద్రోహం చేశారని, ఇప్పుడు వారికి సమాధానం చెప్పలేక టీడీపీ పార్టీ నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా షర్మిల రంగంలోకి దిగారని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు శైలాజానాథ్ ధ్వజమెత్తారు.

YSRCP leader Sailajanath criticize Chandrababu and YS Sharmila

విజయవాడ వరదలు, తిరుపతి లడ్డూ..

విజయవాడ వరదలు, తిరుపతి లడ్డూ, ఇప్పుడు వక్ఫ్‌ బిల్లు విషయం అయినా ఇలా చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా డైవర్ట్‌ చేయడానికి షర్మిల రావడం, ప్రెస్‌మీట్లు పెట్టడం అన్నది ఒక రివాజుగా మారిందని శైలజానాథ్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని నిలదీయడం మరో ప్రతిపక్ష పార్టీకి చెందిన రాష్ట్రశాఖ అధ్యక్షురాలికి ఎంత మాత్రం మంచిది కాదని అన్నారు.

ప్రజలు గమనిస్తూనే ఉన్నారు..

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఏం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారని, ఆమె చేస్తోన్న రాజకీయాలు కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనాల కోసమా? లేక చంద్రబాబు లబ్ది కోసమా అనేది ఆలోచించుకోవాలని శైలజానాథ్ చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ కూటమిని గెలిపించడమే లక్ష్యంగా షర్మిల పని చేశారని గుర్తు చేశారు.

వివేకానందరెడ్డి హత్యోదంతంపై..

తరచుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై షర్మిల మాట్లాడుతున్న తీరు అత్యంత బాధాకరమని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. సొంత చిన్నాన్నను తామే చంపామని, టీవీ లైవ్‌ల్లో మాట్లాడిన వారు ఇప్పుడు అప్రూవర్లుగా మారారని, వారికి బెయిల్ రావడంలో వీళ్లంతా సహకరించారని అన్నారు. ఇప్పుడు దర్జాగా వారు బయట తిరుగుతున్నారు. ఇది అన్యాయం, అధర్మం కాదా అని నిలదీశారు.

వైఎస్ అవినాష్‌ రెడ్డిని దెబ్బకొట్టాలనే..

కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్‌ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే వాళ్లంతా ప్రయత్నం చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. వివేకా హత్య జరిగినప్పుడు సంఘటన స్థలంలో దొరికిన లెటర్‌ను పోలీసులు ఇవ్వొద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించింది.. స్వయంగా ఆయన అల్లుడు, సునీత భర్తేనని చెప్పారు.

కృష్ణారెడ్డే మీడియా ముందు..

వివేకానందరెడ్డితో ఆయన పీఏ కృష్ణారెడ్డికి దాదాపు 40 సంవత్సరాల అనుబంధం ఉందని శైలజానాథ్ చెప్పారు. అలాంటి కృష్ణారెడ్డిని తప్పుడు సాక్ష్యాలు చెప్పమని, బెదిరించి, భయపెట్టి వైఎస్‌ సునీత, ఆమె భర్త ఒత్తిడి తెచ్చారని, ఈ విషయాన్ని స్వయంగా కృష్ణారెడ్డే మీడియా ముందు స్పష్టం చేశారని అన్నారు.

చంద్రబాబు ఆడుతున్న పొలిటిక్ డ్రామా..

ఇదంతా చంద్రబాబు ఆడుతున్న పొలిటిక్ డ్రామా కాదా?, రాజకీయంగా జగన్‌తో ఎవరు ఉన్నా, వారిని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారన్నది నిర్వివాదాంశమని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని శైలజానాథ్ పేర్కొన్నారు.

Take a Poll

డబ్బు కోసం పార్టీ మారానంటూ..

వైఎస్ అవినాష్‌రెడ్డిని ఇరికించాలనే ప్రయత్నం చేసినా, లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి లాంటివారిపై బురదజల్లి వారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా.. వీటన్నింటి వెనుక మాస్టర్ బ్రెయిన్‌ ఎవరో షర్మికు తెలియదా? ఆయన ఏది చెబితే అది మీరు చేయడం నిజం కాదా? అని అన్నారు. డబ్బు కోసం పార్టీ మారానంటూ చివరికి తనపైన కూడా షర్మిల బురదజల్లే ప్రయత్నం చేశారని శైలజానాథ్ అన్నారు.

షర్మిల ఏ డబ్బు కోసం తెలంగాణలో పార్టీ పెట్టారు?..

షర్మిల ఏ డబ్బు కోసం తెలంగాణలో పార్టీ పెట్టారు?.. ఇప్పుడు ఏ డబ్బు కోసం ఆ పార్టీని మూసి వేశారు?, ఏ డబ్బుకోసం మళ్లీ ఏపీకి వచ్చి కాంగ్రెస్‌ అధ్యక్షురాలయ్యారంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఏ పార్టీ ప్రయోజనాల కోసం అధికార పక్షంపై కాకుండా ప్రతిపక్షంపైన, సొంత అన్నపైన అడ్డగోలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో.. ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+