నాగబాబు పై వైసీపీ ఎంపీ అభ్యర్ది ఫిక్స్ - గెలుపెవరిది..!!
ఏపీలో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ప్రతీ సీటులోనూ పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ,జనసేన ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాల పైన జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. పొత్తు లో భాగంగా రీజియన్ల వారీగా ముఖ్య నేతలు పోటీకి సీట్లు ఖాయం అవుతున్నాయి. అందులో భాగంగా భీమవరం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ ఖరారైంది. ఇదే సమయంలో వైసీపీ అభ్యర్ది దాదాపు ఫిక్స్ అయ్యారు.
ఎంపీగా నాగబాబు పోటీ: ఈ సారి ఎన్నికలు పార్టీల కంటే నేతల వ్యక్తిగత ప్రతిష్ఠగా మారుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ పోటీ చేసే నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. కుప్పం బాధ్యతలు పెద్దిరెడ్డికి, మంగళగిరి లో సాయిరెడ్డి, భీమవరంలో ఎంపీ మిధున్ రెడ్డికి గెలుపు బాధ్యతలు అప్పగించారు. మెగా బ్రదర్ నాగబాబు ఈ సారి అనకాపల్లి నుంచి పోటీ చేయటం ఖాయమైంది.

గత ఎన్నికల్లో నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పొత్తుల్లో భాగంగా గెలుపు సాధ్యమనే అంచనాలతో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఇదే అనకాపల్లి ఎంపీగా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన అల్లు అరవింద్ 294183 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది వెంటక సత్యవతి 586,226 ఓట్లు సాధించి 89,192 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
వైసీపీ అభ్యర్ది పై కసరత్తు: 2019 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్ది చింతా పార్ధసారధికి 82,588 ఓట్లు దక్కాయి. ఈ సారి నాగబాబు పైన వైసీపీ నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను మరోసారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించటం పైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో అవంతి టీడీపీ నుంచి ఇక్కడ ఎంపీగా గెలుపొందారు. అవే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గుడివాడ అమర్నాధ్ కు 520,531 ఓట్లు వచ్చాయి.
అవంతి మరోసారి భీమిలి నుంచి పోటీకి సిద్దమయ్యారు. అదే సమయంలో నాగబాబు పైన బీసీ అభ్యర్దిని బరిలోకి దించే ఆలోచన పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్యాల నాయుడు పేరును పరిశీలిస్తున్నారు. అనకాపల్లి పరిధిలోని మాడుగుల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొప్పుల వెలమ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆయన పేరును పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అనకాపల్లిలో కొత్త లెక్కలు: సామాజిక సమీకరణాల్లో భాగంగా కాపు లేదా బీసీ వర్గాల్లో ఎవరికి ఎంపీ సీటు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ వర్గానికి కేటాయించటం ద్వారా నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో జనసేన పెందుర్తి, ఎలమంచిలి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది.
దీంతో, నాగబాబుకు ఈ లెక్క కూడా అనుకూలిస్తుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ పార్లమెంట్ పరిధిలో సీఎం జగన్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే అభ్యర్దులను ఖరారు చేసారు. ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్ది విషయంలో జగన్ అధికారికంగా చేసే ప్రకటన పైన ఆసక్తి కనిపిస్తోంది.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications