జగన్‌పార్టీ మేయర్ అభ్యర్థి ఓటమి, కాంగ్రెస్ లెక్క ఇంతే

మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించడంపై ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కె శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని ప్రజలు గుర్తించారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవినీతి, అక్రమాల పుట్ట అని, టిడిపి నీతివంతమైన రాజకీయాన్ని నమ్ముకుందని, ప్రజల కోసం నిత్యం పోరాటం చేసిన పార్టీ అన్నారు.
అవన్నీ తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిన అంశాలన్నారు. పట్టణ ప్రాంత ఓటర్ల నిర్ణయం టిడిపి పక్షం వైపే ఉందని, సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరాన్ని ప్రజలు గుర్తించారన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి ఏకపక్ష విజయం దక్కిందన్నారు. రేపు పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయిన్నారు.
ఖాతా తెరవని కాంగ్రెస్
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి పూర్తిగా నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో అయితే కాంగ్రెసు పార్టీ కనీసం ఒక్క స్థానం కూడా గెల్చుకోలేదు. విశాఖ, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కో స్థానం గెల్చుకుంది. కర్నూలులో రెండు, శ్రీకాకుళంలో 3 స్థానాలు వచ్చాయి. కేవలం విజయనగరం (11), గుంటూరు (11), నెల్లూరు (13)ల్లో మాత్రమే రెండెకేల స్థానాన్ని అందుకుంది.












Click it and Unblock the Notifications